అఖిల భారత వ్యవసాయ & గ్రామీణ కార్మిక సంఘం (AIARLA) డిమాండ్!
విజయవాడలో ధర్నా నిర్వహణ
రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి విజయవాడ ధర్నా చౌక్ కు తరలి వచ్చిన గ్రామీణ వ్యవసాయ కార్మికులు ఉపాధి హామీ పధకoలో కేంద్ర తీసుకువస్తున్న కార్మిక వ్యతిరేక మార్పులను రద్దు చేయాలి కోరుతూ ధర్నా నిర్వహించారు.
ఈ సందర్బంగా కార్మికులను ఉద్దేశించి “లిబెక్టక్” ఇండియా పరిశోధకుడు బుద్ధ చక్రధర్ మాట్లాడుతూ, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకoలో మార్పులు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపై ఒత్తిడి తీసుకువస్తున్నదని మన రెండు తెలుగు రాష్ట్రాలు ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా 2021 నవంబర్, డిసెంబర్ల నుండి వాటిని అమలు చేయడం మొదలు పెట్టాయాని అన్నారు. ఈ మార్పులు ఏవిధాంగా చూసినా హేతుబద్ధంగా లేవని అన్నారు. ఉపాధి పధకంలో చేసిన పనిని బట్టి వేతనం ఇస్తారుగాని ప్రభుత్వ ఉద్యోగుల్లా సమయాన్ని బట్టి ఇవ్వరని అయినా “జియో టేగింగ్ తో” ఒక పని దినంలో రెండు సార్లు ఫోటోలు తీయాలనే నియమం పెట్టారని ఆయన అన్నారు. ఈ కొత్త మార్పులు కారణoగా రెండు తెలుగు రాష్ట్రాలలో గ్రామీణ కార్మికులు పని దినాలు, వేతనాలు నష్టపోతున్నారని ఆయన అన్నారు.
అఖిల భారత వ్యవసాయ & గ్రామీణ కార్మిక సంఘం (AIARLA) జాతీయ కార్యదర్శి బుగత బంగార్రావు మాట్లాడుతూ , ఉపాధి హామీ పధకంలో మన రెండు తెలుగు రాష్ట్రలలో అమలు చేస్తున్న పద్ధతులు దేశానికే ఆదర్శంగా వుండేవని అలాంటి పద్దతులను కేంద్రం చెప్పిందని పేరుతొ 2021 డిసెంబరు నుండి రద్దు చేయడం మొదలు పెట్టారని, 2021 డిసెంబరు ముందు నాటి స్థితిని పునరుద్దరించాలని కోరారు.
Also read: అంతటివాడు చెప్పినా పరిష్కారానికి నోచుకోసి సమస్య
అఖిల భారత వ్యవసాయ, గ్రామీణ కార్మిక, సంఘం, ఆంధ్రప్రదేశ్ విభాగం అధ్యక్షుడు తామాడ సన్యాసిరావు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తీసుకు వస్తున్న మార్పులు, కార్మికులు పని లోని రాకుండా చేయడానికి ఉద్దేశించినవనీ, “పొమ్మనకుండా పొగ” పెట్టినట్లుగా ఇవి వున్నాయనీ, వీటిని బేషరతుగా రద్దు చేయాలనీ కోరారు. దేశ కార్మిక వర్గంలో 90% గా ఉన్న గ్రామీణ వ్యవసాయ కార్మికులకు ఉపాధి కల్పించే ఉపాధి హామీ పథకాన్ని మోదీ నాయకత్వంలోని కేంద్ర బిజెపి సర్కార్ నిర్వీర్యం చేస్తున్నదనీ, రైతు ఉద్యమం తరహాలో దేశవ్యాప్త గ్రామీణ వ్యవసాయ కార్మికుల ఉద్యమాన్ని నిర్మిస్తామనీ ఆయన అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బారావు, రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్ వెంకటేశ్వర్లు, మానవ హక్కుల వేదిక (హెఆర్ఎఫ్)కు చెందిన గట్టు రోహిత్ ఈ ధర్నాలో పాల్గొని గ్రామీణ వ్యవసాయ కార్మికుల ఉద్యమానికి తమ సంఘీభావం ప్రకటించారు.
అఖిల భారత వ్యవసాయ & గ్రామీణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎగుపాటి అర్జున రావు, జాతీయ కార్యవర్గ సభ్యుడు MP రాం దేవ్, CPI ML లిబరేషన్ కేంద్ర కమిటి సభ్యులు కామ్రేడ్ నాగమణి,D . హరినాథ్, రాష్ట్ర కార్యదర్శి, కిసాన్ మహాసభ, మద్దిల మల్లేశ్వరరావు, జాతీయ కార్యవర్గ సభ్యులు, అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం, P. సంఘం, మన్యం జిల్లా కార్యదర్శి, అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం పాల్గొని ప్రసంగిoచారు.
Also read: ఉపాధి పధకంలో మార్పుల లక్ష్యం ఏమిటి?
P.S. అజయ్ కుమార్
జాతీయ కార్యదర్శి, అఖిల భారత వ్యవసాయ & గ్రామీణ కార్మిక సంఘం (AIARLA) సెల్ :9441241609