• వివిధ శాఖల అధికారులతో సమన్వయ భేటీ అయిన రామగుండం సిపి
ఎన్టీపీసీ లోని మిలీనియం హల్ లో రామగుండం పోలీస్ కమీషనర్ వి. సత్యనారాయణ మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లోని కార్మిక, మహిళా, శిశు సంక్షేమ శాఖ, వికలాంగుల, వృద్ధుల శాఖ, సర్వశిక్ష అభియాన్, ఆరోగ్య శాఖ, విద్యా శాఖ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, ఎన్‌జిఓ లు సఖి, బారోసా, స్పంధన,ఆర్‌పిఎఫ్, లీగల్ అడ్వైజర్, చైల్డ్ హెల్ప్ లైన్, రెవెన్యూ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. మానవ అక్రమ రవాణా గురించి తెలంగాణ రాష్ట్రం లో ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో 31 వ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ను ప్రారంభించారు. ఇందో భాగంగా రామగుండం పోలీస్ కమీషనరేట్ లో ఒక యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ టీమ్ ఏర్పాటు చేశారు. దానికి స్పెషల్ పోలీస్ ఆఫీసర్లుగా గా పెద్దపల్లి జిల్లాకి రాజ్ కుమార్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్, మంచిర్యాల జిల్లాకి కిరణ్ కుమార్ టాస్క్ ఫోర్స్ ఇన్స్ స్పెక్టర్ ని నియమించారు. ఈ టీమ్ లో ఇద్దరు ఎస్‌ఐ లు ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ లు, ఇద్దరు పిసి లు ఉంటారు. వీరు కమీషనరేట్ లోని జిల్లా లో ఉన్న ధీర్ఘకాలింగా పెండింగ్ మిస్సింగ్ వుమెన్ అండ్ చిల్డ్రన్ కేసుల వివరాలను సేకరించి, విచారించి, దర్యాప్తు చేయనున్నారు. బాధితుల సంక్షేమం సంరక్షణ ను దృష్టి లో పెట్టుకొని మళ్ళీ బాధితులు కాకుండా నేరాల నివారణ మరియు అరికట్టడం, నేరస్థులను వారి సహాయకులను మోసగాళ్లను విచారించి శిక్ష పడే విధంగా అన్ని శాఖ లతో ఏహె చ్‌టియూ టీమ్ అనుసంధానం చేశారు.
Also Read: సింగేణిలో 2 లక్షల మొక్కలు నాటే భారీ సామూహిక కార్యక్రమం
Also Read: రహదారి భద్రత పై అవగాహన సదస్సు
ట్రాఫికింగ్ కు గురైన బాలికలను వ్యభిచార వృత్తిలో దించడం, ఇతర పద్ధతులలో లైంగిక వేధింపులు, బలవంతంగా కార్మికులుగా, సేవకులుగా వినియోగించుకోవడం, నియమించుకోవడం జరుగుతోందని రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో మానవ అక్రమ రవాణా ను నిరోధించడానికి పోలీసు శాఖతో పాటు అన్ని శాఖల సమన్వయం అవసరమని సీపీ అన్నారు. చిన్నపిల్లలను, మహిళలను అక్రమంగా రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో నేరాలను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలను చేపట్టి, నేర రహిత కమిషనరేట్ చేయడంలో భాగంగానే యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. హ్యూమన్ ట్రాఫికింగ్ రూపు మాపడం లో ప్రతి యొక్క డిపార్ట్ మెంట్ కృషి చేయాలని, ఇలాంటి నీచమైన మానవ అక్రమ రవాణా ను అరికట్టడం లో ప్రతి ఒక్కరు పాల్గొని పసి మొగ్గలను కాపాడి వారికి ఉన్నతమైన జీవితం ఇవ్వాలని సీపీ అధికారులకు విజ్ఞప్తి చేశారు.