————————
( ‘ THE OTHER WANDERER ‘ FROM ‘ THE WANDERER’ BY KAHLIL GIBRAN )
తెలుగు అనువాదం: డా. సి. బి. చంద్ర మోహన్
51. సంచారితత్వాలు
——————–
మరోసారి నేను రోడ్డుపై ఇంకో మనిషిని కలుసుకున్నాను. అతను కూడా కొంచెం తేడా మనిషి.
అందుకే నాతో మాట్లాడాడు : “నేనొక సంచారిని. చాలా సార్లు, నేను మరుగుజ్జుల మధ్య భూమిపై తిరుగుతూ ఉంటాను. నా శిరస్సు , వారి తలల కన్నా భూమినుండి డెబ్బయి మూరల ఎత్తులో ఉంటుంది కనుక — అది ఉన్నతమైన స్వేచ్ఛగల ఆలోచనలను సృష్టించ గలుగుతుంది.
“కానీ నిజానికి నేను మనుషులతో నడవను. వారి పైన నడుస్తాను. వారి బహిరంగ స్థలాల్లో — నా పాద ముద్రలు మాత్రమే వారు చూడగలరు.
“ఇంకా , నా పాద ముద్రల ఆకారము, కొలతల గురించి వారు చర్చించు కోవడం నేను తరచుగా వింటాను. ‘ గతంలో ఎప్పుడో — ఆ అసాధారణ వ్యక్తి తిరుగాడిన జాడలు ఇవే ‘ అని కొందరు అంటారు. మరి కొంత మంది ‘ లేదు. బహు దూరపు నక్షత్రాల నుండి ఉల్కలు రాలి పడిన ప్రదేశాలు ఇవే !’ అంటారు.
“కానీ మిత్రమా, ఇవి ఒక సంచారి పాద ముద్రలని నీకు బాగా తెలుసును కదా!”
Also read: నిన్నా, నేడూ, రేపూ
Also read: మార్పిడి
Also read: ప్రవక్త
Also read: మతం
Also read: ఇసుక పైన