- నిన్న సానియా…నేడు అంకిత
- ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ మెయిన్ డ్రాలో చోటు
ప్రపంచ మహిళా టెన్నిస్ లో సానియా మీర్జా వారసురాలు తానేనని భారతయువ క్రీడాకారిణి అంకిత రైనా చాటుకొంది. ప్రస్తుత సీజన్ తొలిగ్రాండ్ స్లామ్ టోర్నీ ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ మహిళల డబుల్స్ మెయిన్ డ్రాకు అర్హత సాధించడం ద్వారా తానేమిటో నిరూపించుకొంది. గతంలో ఇదే ఘనత సాధించిన మరో నలుగురు భారత మహిళల సరసన చోటు సంపాదించింది.
మెల్బోర్న్ రాడ్ లేవర్ ఎరీనా వేదికగా ప్రారంభమైన 2021 ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ మహిళల డబుల్స్ మెయిన్ డ్రాలో…రుమేనియాకు చెందిన మిహాయేలా బుజరెస్క్యూతో జంటగా పోటీకి దిగనుంది.
1971లో నిరుపమ మన్కడ్, 1998లో నిరుపమ వైద్యనాధన్, 2004లో సానియా మీర్జా, శిఖా ఒబెరాయ్ ..గ్రాండ్ స్లామ్ టోర్నీ మెయిన్ డ్రాకు అర్హత సాధించిన భారత మహిళలుగా ఉన్నారు. 17 సంవత్సరాల విరామం తర్వాత ఇప్పుడు అంకిత రైనా అర్హత సాధించడం ద్వారా రికార్డుల్లో చోటు సంపాదించింది. ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ మహిళల డబుల్స్ తొలిరౌండ్లో ఆస్ట్ర్రేలియన్ జోడీ ఒలీవియా- బెలిండాలతో తలపడనున్నారు.
Also Read : చెన్నై టెస్టులో భారత్ ఎదురీత
సింగిల్స్ మెయిన్ డ్రాలో సుమిత్ నగాల్
పురుషుల సింగిల్స్ మెయిన్ డ్రాకు భారత ఆటగాడు సుమిత్ నగాల్ అర్హత సంపాదించాడు. ప్రపంచ 72వ ర్యాంక్ ఆటగాడు, లిథువేనియాకు చెందిన రికార్డోస్ బెంకిస్ తో సుమిత్ నగాల్ తొలిరౌండ్లో తలపడనున్నాడు.
Also Read : రూట్ డబుల్.. భారత్ కు ట్రబుల్