అది నల్ల నేల గా పిలువబడే కోల్ బెల్ట్ ప్రాంతం లోని మందమర్రి పట్టణ ప్రాంతం..సింగరేణి కార్మిక కుటుంబంలో పుట్టిపెరిగిన వేల్పుల బాణయ్య అలియాస్ అందరి వాడు పులి అన్న ఆదివారం తీవ్ర అనారోగ్యం కారణంగా తన 67 వ ఏట మరణించాడు.. బాణయ్య ను ఊర్లో ఎరగని వారు లేరు. సింగరేణి సీఎస్పీ లో పని చేస్తూ 30 ఏండ్ల కిందనే డస్ట్ వల్ల ఆరోగ్యం బాగుండడం లేదని ఉద్యోగం వదిలేసాడు. పెండ్లి చేసుకోలేదు.
తండ్రి తమ్ముడు సింగరేణిలో ఉద్యోగం చేసే వారు. తండ్రి చనిపోగా తమ్ముడు రిటైర్ అయ్యారు. బాణయ్య తనకు వచ్చే పెన్షన్ తో జీవనం సాగించే వాడు.. అయితే ఏంది ప్రత్యేకత అనుకున్తున్నారేమో… ఆయన చాలా కుటుంబాలకు ప్రత్యేకమే.. గడ్డం..వడి తిప్పిన మీసాలు.. బక్కపలుచగా ఉన్న గట్టి శరీరం.. అందుకే ఆయన ను అందరూ పులి అని పిలిచే వారు.. చాలా మంది స్నేహితుల, హితుల పిల్లలను వివిధ దూర ప్రాంతాలకు చదువులకు తీసుకెళ్లి దిగ పెట్టడం తీసుకురావడానికి వెళ్లడం.. ఇంటిలో ఎ పని అయినా సహాయం చేయడం, అందరి యోగ క్షేమాలు చూడడం, ఆసుపత్రులకు తీసుకెళ్లడం, అవసరమైతే అటెండెంట్ గా ఉండడం.. ఎన్నో ఇండ్లలో బాణయ్య తలలో నాలుక అయ్యారంటే అతిశయోక్తి కాదు.
Also Read : మహిళల చేతిలో కమండలం..
ఉద్యమ కారులకు.. పౌరహక్కుల నేతలకు కార్యకర్తలకు ఆయన స్నేహితుడు..హితుడు కూడా.. కష్ట కాలంలో అందరికి యాదికి వచ్చే నిండు మనిషి ఆయన.. మార్కెట్ లోని బాబ్బాయ్ పాన్ షాప్ ఆయన అడ్డా.. అదే కేర్ ఆఫ్ అడ్రెస్.. మడక రాయలింగన్న.. మార్టిన్ ప్రకాష్ , జి. కనకయ్య ఇంకా ఎందరో ఆయనకు సమీప మిత్రులు… అందరివాడు బాణయ్య లాంటి వారు నల్ల నేల నుంచి శాశ్వితంగా సెలవు తీసుకొని వెళ్లి పోతున్నారు… పులి అన్నా జిందాబాద్.. మందమర్రి కా దోస్త్ అమర్ రహే…….అందరూ ప్రేమించే అందరిని ప్రేమించిన….ఈ కాలంలో పులి లాంటి మనుషులు లేరు.. రారు.. ఆయనే మళ్ళీ పుడితే తప్ప….పులి మంచి సాహితీ ప్రియుడు.. పట్ట భద్రుడు కూడా….
Also Read : హుందాగా సాగని ప్రచారం