అనంత చతుర్దశి వ్రతం లేదా అనంత పద్మనాభ వ్రతం. ఇది తెలుగు లోగిళ్ళల్లో చేసుకునే విశిష్టమైన వ్రతం. హిందూ సంప్రదాయంలో ఉన్న కామ్య వ్రతాలలో ప్రధానమైనదని వ్రత గ్రంథాలు పేర్కొంటున్నాయి. కష్టాలలో మునిగి ఉన్నప్పుడు బయటపడటానికి ఓ ఉత్తమ సాధనంగా ఈ వ్రతాన్ని భావించటం తరతరాలుగా వస్తోంది.
ఎంతో పూర్వ కాలం నుంచి ఈ వ్రత ప్రస్తావన భారతావనిలో కనిపిస్తుండటం విశేషం. పాండవులు వనవాసం సమయంలో కష్టాలను అనుభవిస్తున్న ధర్మరాజు శ్రీకృష్ణుడిని వాటి నుంచి గట్టెక్కేందుకు ఏదైనా వ్రతం ఉంటే చెప్పమన్నాడు. అప్పుడు కృష్ణుడు అనంతపద్మనాభ వ్రతాన్ని భాద్రపద శుక్లచతుర్దశినాడు చేయమని చెప్పాడట. అలాంటి వ్రతం ఇంట్లో చాలా మంది ఆచరిస్తారు! ఈ వ్రతంలో ప్రధానాంశమైన చేతికి ధరించే ఎర్రటి తోరానికి 14 ముడులుంటాయి. మరి కొందరు నైవేద్యానికి 14 రకాల పండ్లు, పిండి వంటలు, పూజ కోసం పత్రిని వాడుతుంటారు. ఇదంతా ఏడేడు పద్నాలుగు లోకాలను ఏలే కాలస్వరూపుడైన ఆ దివ్య మంగళ స్వరూపుడిని తలచుకోవటం కోసమే.
Also Read : అమ్మకు ప్రతి రూపం కూతురు! అమావాస్య అదృష్టం ఆమెదే! పౌర్ణమి ఆటు పోట్లు ఆవిడవే!!
అనంతగిరి కొండల్లో వెలసిన ఆలయం
అలాంటి దేవాలయం అనంత గిరి కొండల్లో (వికారాబాద్) వెలిసింది. అంతటి మహత్తు గల క్షేత్రం హైద్రాబాద్ లో ఉందని అక్కడ నారసింహ యాగం చేస్తున్నామని మా మిత్రుడు శ్రీ కొండపాక కృష్ణమా చార్యులు గారు చెప్పడం వల్ల అతిథిగా హాజరయ్యాను. సువిశాలమైన కొండపై పారిశ్రామిక సంస్థలు చుట్టూ ఉన్న ప్రదేశంలో స్వయంభూగా వెలిసిన ఆ స్వామి విగ్రహాన్ని చూసి జన్మ తరించింది. పుప్పాల గూడా, మణికొండ గ్రామస్థులు…పారిశ్రామిక వేత్తలు… కలసి కిలోమీటర్ మేర గుట్టపైకి రోడ్డు వేశారు. గొప్ప అధ్యాత్మిక వాతావరణంలో వెలిసిన ఈ దేవాలయ ప్రాంగణములో కృష్ణతత్వ పఠనం, యోగ క్లాసులు జరుగుతున్నాయి. ఇంత గొప్ప క్షేత్రంలో శ్రీ నరహరి ఆచార్య గారితో కలసి శ్రీ కొండపాక కృష్ణమాచార్యులు గారు గిన్నిస్ బుక్ రికార్డు ను అధిగమించడానికి చేస్తున్న ఈ యాగం ఈ సారి ఈ దేవాలయంలో జరిగింది…ఇంత గొప్ప కార్యక్రమంలో నన్ను అతిథిగా పిలిచి సన్మానం చేసిన దేవాలయం ఛైర్మెన్ దంపతులు శ్రీ బట్టా సత్యనారాయణ – మాధవిలకూ, తెలంగాణలో ఎన్నో దేవాలయాల్లో EO (ఎగ్జిక్యూటివ్ ట్) గా పనిచేసిన శ్రీ వెల్డండ వాసుదేవరావు- సుకన్య దంపతులకూ, హాజరైన అశేష భక్త జన బంధు మిత్రులకూ కృతజ్ఞతలు… తెలంగాణ కరణం నియోగ బ్రాహ్మణ సంఘం త్వరలో నిర్వహించే ప్లీనరీ సమావేశాలలో కూడా నారసింహ యాగం చేయడానికి మా పొలిట్ బ్యూరో లో చర్చ చేస్తాను.
Also Read : మిడ్ లైఫ్ మిసమిసలు
– బండారు రాం ప్రసాద్ రావు, TKNBS స్టేట్ ప్రసిడెంట్