————————-
( ‘ THE STATUE ‘ FROM ‘ THE WANDERER ‘ BY KAHLIL GIBRAN )
అనువాదం: డా. సి.బి. చంద్ర మోహన్
18. సంచారి తత్త్వాలు
——————
పూర్వం కొండల మధ్యన ఒక మనిషి నివసించే వాడు. అతని వద్ద ఒక మహా శిల్పి చెక్కిన విగ్రహం ఒకటి ఉండేది. ఆ విగ్రహం అతని ఇంటి గుమ్మం వద్ద తలక్రిందులుగా పడి ఉండేది. అది అతని ధ్యాసలోనే ఉండేది కాదు.
ఒక రోజు నగరం నుండి ఒక మనిషి అటు వైపుగా వచ్చాడు. అతడు తెలివి తేటలు కల వాడు. ఆ విగ్రహాన్ని చూడగానే దాని స్వంత దారుని ” ఆ విగ్రహాన్ని అమ్ముతావా?” అని అడుగుతాడు.
ఆ స్వంత దారు నవ్వి ” ఆ నిస్తేజమైన ,మురికి రాయిని ఎవరు కొంటారు?” అంటాడు.
ఆ పట్నం మనిషి ” నేను దీనికి ఒక వెండి నాణెం ఇస్తాను.” అంటాడు.
ఆ స్వంతదారు ఆశ్చర్యము మరియు ఆనందం పొందాడు.
ఏనుగు వీపు మీద ఆ విగ్రహం నగరానికి తరలించ బడింది.
చాలా రోజుల తరువాత ఆ కొండలలో మనిషి ఒక రోజు పట్నానికి వెళతాడు. అతను అలా బజారులో తిరుగుతూ, – ఒక దుకాణం ముందు జనం గుమి గూడడం చూస్తాడు. ఒక మనిషి పెద్ద గొంతుతో ఇలా అరుస్తూ కనిపించాడు ” రండి!రండి! లోకంలో అత్యంత సుందరమైన, అద్భుతమైన శిలా విగ్రహం చూడండి! ఒక మహా శిల్పి చెక్కిన అపురూపమైన ఈ శిల్పాన్ని రెండు వెండి నాణాలు మాత్రమే చెల్లించి దర్శించుకోండి!”
ఆ కొండ మనిషి రెండు వెండి నాణాలు చెల్లించి ఆ విగ్రహం చూడ్డానికి లోపలికి వెళ్లాడు.
ఆ శిల్పం మరేదో కాదు. తాను ఒకప్పుడు ఒక వెండి నాణానికి అమ్మిన విగ్రహమే అది !
Also read: ఇద్దరు సంరక్షక దేవ దూతలు
Also read: యుద్ధమంటే ఏమిటో…..అడుగు
Also read: దేశాన్ని చూసి జాలిపడు
Also read: పరిపూర్ణ జీవనం
Also read: నర్తకి