ఫొటో రైటప్: డిజైన్ లో అమరావతి నగరం
కళ్ళ ముందే రాజధాని కలలు
కూలుతున్న చప్పుడు!
విడి పోయి ఓడి పోయాము
ఏ బంగారు భవిష్యత్ కోసం
పచ్చని నేల నెర్రలు గా
చీలి పోయిందో!
ప్రవాహంలా కదిలే
రైతన్నలకు
రాజకీయ ఊసర వెల్లుల
సర్వ దర్శనాలే!
పార్టీల మొసలి కన్నీటితో
సరి గంగ స్నానాలే!
ఏ జండా వచ్చినా
దుఃఖం ఎజండా
మారదులే!
“మూడు”
జపంతో
మాడు పగులు తోంది!
చిత్త శుద్ది లేని
రాజకీయ యజ్ఞంలో
రైతులే
మారని సమిధలు!
–వీరేశ్వర రావు మూల
(అమరావతిలో రాజధాని నిర్మించాలని కోరుతూ రైతులు ఉద్యమం చేస్తున్న సందర్భంలో)
Also read: అవ “మానాలై”
Also read: ఆర్ ఆర్ ఆర్ : కొట్టొచ్చినట్టు కనిపించిన కథలేని లోటు
Also read: యుద్దమంటే మనిషే పంచభూతాలకూ
Also read: దూరం
Also read: కాలం ఆగిపోయింది