Saturday, December 21, 2024

భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ కావడం సరే, ఎన్నికలు గెలవడం వేరు, అది వేరే కళ

మాడభూషి శ్రీధర్

మొదటి లోక సభ ఎన్నికలు అక్టోబర్ 1951 నుంచి ఫిబ్రవరి 1952దాకా జరిగాయి.  అంటే 26 జనవరి 1950 లో భారత రాజ్యంగం ప్రారంభం కావడానికి ముందు ఎన్నికలు జరగలేదు. కాని అంతకు ముందు ఎన్నికలు జరిగినపుడు బ్రిటిష్ ప్రభుత్వంలో జరిగిన ఎన్నికలలో జవాహర్ లాల్ నెహ్రూ ప్రధాన మంత్రిగా అప్పటికే గెలిచి ఉన్నారు. అప్పుడు ప్రభుత్వంలో జన సంఘ్ పార్టీ నాయకుడుగా శ్యామా  ప్రసాద్ ముఖర్జీ పారిశ్రామిక మంత్రిగా ఉన్నారు. అంబేడ్కర్  షెడ్యూల్డ్ కులాల ఫెడరేషన్ పార్టీనాయకుడు. ఆ తరువాత ఈ పార్టీ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పేరుతో మారింది. అప్పట్లొ జెబి క్రిపలానీ నాయకత్వంలో కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ ఉండేది. రామ్ మనోహర్ లోహియా, జయప్రకాశ్ నారాయణ్ నాయకత్వంలో సోషలిస్ట్ పార్టీ ఉండేవి. అంబేడ్కర్ బాంబే రిజర్వ్ డ్ సీట్ నుంచి ఓడిపోయారు. వారితో పోటిలో గెలిచిన వాడు ఎన్ జె కైరోల్కర్, వారిలో అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రీ, గుల్జారీ లాల్ నందా గెలిచారు.  వీళ్లంతో లోకసభలో పోటీచేసిన వారు. కాని ఆతరువాత రాజ్యసభ ఎన్నికలలో బాంబే  నియోజిక వర్గం నుంచి అంబేడ్కర్ పార్లమెంట్ కు గెలిచారు.

ఎన్నికలలో అంబేడ్కర్ పరాజయం, ఆ తరువాత విజయం

1952 పార్లమెంట్ ఎన్నికల్లో అంబేడ్కర్ నార్త్ బొంబాయి లోక్ సభ స్థానానికి పోటి చేసి ఓడిపోగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎన్.ఎస్. కాజ్రోల్కర్ గెలుపొందారు. ఆ తర్వాత 1952లో బొంబాయికి ప్రాతినిధ్యం వహిస్తూ రాజ్యసభకి ఎన్నికయ్యాడు. ఐతే, 1952లో బొంబాయి కి జరిగిన ఎన్నికల్లో భారతీయ జన సంఘ్ (BJS) పార్టీ రెండు స్థానాల్లో పోటి చేస్తే ఒక్క చోట కూడా గెలవలేదు, అంటే ఆ పార్టీకి అప్పటి అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేదు, అలాంటప్పుడు జన సంఘ్ సహాకారంతో అంబేడ్కర్ రాజ్య సభకి ఎన్నికయ్యాడన్న వాదనలో బలం లేదు అని ఫాక్ట్లీ అనే రచయిత (https://factly.in/telugu-no-truth-in-the-claim-that-ambedkar-was-elected-to-rajya-sabha-with-the-help-of-jana-sang-after-losing-1952-lok-sabha-elections/) వివరించారు.

అన్యాయంగా అబద్దాలు చెప్పడం అనేకానేక పార్టీలు తమ పార్టీ విధానాలు సిద్ధాంతం కావడం విశేషం. విష ప్రచారాలు, ఎన్నికలలో గెలవడానికి ఓడించడానికి, ప్రస్తుతం అబద్దాలు అతి త్వరగా అన్నిసైబర్ దుర్మార్గాల పార్టీలకు నేర్చడం సాధ్యమవుతున్నది.

‘1952 పార్లమెంట్ ఎన్నికల్లో నెహ్రు అంబేడ్కర్ కి వ్యతిరేకంగా ప్రచారం చేసి ఓడిస్తే, జన సంఘ్ పార్టీ సహాయంతో అంబేడ్కర్ రాజ్యసభకి వెళ్లారు’ అని చెప్పడం తప్పు అని ఫాక్ట్లీ అనే సంస్థ వివరించింది.

దీనికి సంబంధించిన మరి వివరాలు చాలా ముఖ్యం. స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగిన మొదటి లోక్ సభ ఎన్నికలు అక్టోబర్ 1951 లో, ఫిబ్రవరి 1952 మధ్య ఐదు నెలల పాటు జరిగాయి. ఈ ఎన్నికల ముందు శ్యామా ప్రసాద్ ముఖర్జీ కాంగ్రెస్ నుండి విడిపోయి భారతీయ జన సంఘ్‌ని స్థాపించారు. అదేవిధంగా, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కూడా షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్‌ను (SCF) ఏర్పాటు చేసి నార్త్ బొంబాయి నుండి లోక్ సభకి పోటి చేసారు. కాని పోటీలో అంబేడ్కర్ ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎన్.ఎస్. కాజ్రోల్కర్ గెలిచారు. ఆ ఎలక్షన్ లో అంబేడ్కర్ నాలుగో స్థానంలో నిలిచారు. ఆ తరువాత అంబేడ్కర్ బొంబాయికి ప్రాతినిధ్యం వహిస్తూ రాజ్యసభలోకి  (కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్) ప్రవేశించారు.

ఇంకో పరాజయం

ఆ తర్వాత 1954 భాంద్రా లోక్ సభ నియోజికవర్గానికి జరిగిన ఉపఎన్నికలో రెండోవసారి పోటీ చేసి కూడా అంబేడ్కర్ ఓడిపోయారు. ఆశ్చర్యం ఏమంటే రాజ్యాంగ నిర్మాత, ఈ దేశానికి మార్గదర్శకుడైనా ఎన్నికల పోటీల్లో గెలవడం వేరని తేలింది.

అందులో రాజ్యసభ సీట్ల గురించి కేటాయింపు ఏవిధంగా తెలియాలి?

రాజ్యాంగం ప్రకారం, రాష్ట్ర జనాభా ఆధారంగా రాష్ట్రానికి రాజ్యసభ సీట్ల కేటాయింపు జరుగుతుంది. ఆ విధంగా కేటాయించిన సీట్లకు ప్రతినిధులను లోక్ సభలో వలె నేరుగా ప్రజలు ఎన్నుకోకుండా సింగల్ ట్రాన్స్ఫరెబల్ వోట్ పద్దతిలో ఆయా రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికైన ప్రజా ప్రతినిధులు ఎన్నుకుంటారు. ఆ  ప్రకారం అంబేడ్కర్ లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయినా తర్వాత 1952లో బొంబాయికి ప్రాతినిధ్యం వహిస్తూ రాజ్యసభకి ఎన్నికైనారు.  ఐతే అంబేడ్కర్ బొంబాయి అసెంబ్లీ నుండి రాజ్యసభకి ఎన్నికవ్వాలంటే ఆ అసెంబ్లీలోని ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి.  అప్పుడు 1951లో బొంబాయి అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో భారతీయ జన సంఘ్ (BJS) రెండు స్థానాల్లో పోటీ చేస్తే ఒక్క చోట కూడా గెలవలేదు. కనుక అంబేడ్కర్ రాజ్యసభకి జన సంఘ్ వారి బలంతో ఎన్నికయ్యాడనే వాదనే చెల్లదు. ప్రభుత్వ డేటా ప్రకారం ఎన్నికల వివరాలు చదివిన తెరువాత అర్థమవుతుంది.

పైగా 1951 బొంబాయి అసెంబ్లీ ఎన్నికల్లో అంబేడ్కర్ స్థాపించిన షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్‌ను (SCF) పార్టీ 37 స్థానాల్లో పోటి చేస్తే కేవలం ఒక్క చోటే గెలిసింది, కాబట్టి తమ సొంతంగా కూడా అంబేడ్కర్ రాజ్య సభకి ఎన్నికయ్యే అవకాశం లేదు. ఈ  ఎన్నికల్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (INC) 269 స్థానాల్లో గెలుపొందగా, 18 స్థానాల్లో ఇండిపెండెంట్లు గెలుపొందారు, పీసంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ( PWP)కి చెందిన 14 మంది గెలుపొందారు. దీన్నిబట్టి అంబేడ్కర్ రాజ్యసభకి ఎన్నికవ్వాలంటే కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా మద్దతిచ్చి ఉంటుందని అర్ధం చేసుకోవచ్చు.

1952 ఎన్నికలకు సంబంధించి అంబేడ్కర్ కి చెందిన షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్‌ (SCF) పార్టీ మేనిఫెస్టోలో హిందూ మహాసభ లేదా ఆర్ఎస్ఎస్ (RSS) వంటి ఏ రియాక్షనరి పార్టీతోనూ తమ పార్టీ పొత్తు పెట్టుకోదని పెర్కొనట్టు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పారు.

1952 లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయిన అంబేడ్కర్, ఆ తర్వాత జన సంఘ్ సహకారంతో రాజ్యసభకు ఎన్నికయ్యాడన్న వాదనలో నస తప్ప మరే పస లేదు.  ఫాక్ట్ లీ అనే సంస్థ అందులో 92470 52470 లో ఫోన్ నంబర్ కూడా రాసి ఇచ్చారు.

అంబేడ్కర్ గురించి ఏదో చెప్పడానికి రాయడానికి ప్రయత్నిస్తూ హాని చేయడం తప్పు. అంబేడ్కర్ వంటి మహానుభావుల తప్పులు పట్టుకోవడం న్యాయం కాదు. అంబేడ్కర్ లేకుండా మనకే ఈ రూల్ ఆఫ్ లా గురించే ఆలోచించే శక్తి రాదు.  గాంధీ నెహ్రూలు గురించిగానీ. అంబేడ్కర్ గురించి గానీ చరిత్ర మనముందు ఉంది. ఏం చెప్పదలచుకున్నా చాలా చదవవలసిన అవసరం ఉంది. చరిత్ర చదువుకోకుండా ఏమీ చెప్పకూడదు.

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles