14 ఏప్రిల్, అనకాపల్లి జిల్లా, అనకాపల్లి మండలం, సంపత్ పురం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఉమ్మడి విశాఖ జిల్లా కలెక్టర్ గాను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చీఫ్ సెక్రటరీగా పనిచేసిన సీనియర్ IAS అధికారి శ్రీ అజయ్ కల్లం విగ్రహావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో అనకాపల్లి జిల్లా, అనకాపల్లి మండలం లో లేండ్ పూలింగ్ ద్వారా భుములు తీసుకోని, ప్రత్యామ్నాయ భూములను ఇంకా అప్పగించని అంశాన్ని ప్రస్తావించి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
కొత్త జిల్లాలలో ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలను వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. విశాఖపట్నం జిల్లా నుంచి పాడేరు ITDA అల్లూరి సీతారామరాజు జిల్లాలకు వెళ్లిపోయిన తర్వాత కొత్తగా ఏర్పడిన అనకాపల్లి జిల్లాలో ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి, పాడేరు ITDA అల్లూరి సీతారామరాజు జిల్లాలో కలిసినప్పటికీ, అనకాపల్లి జిల్లా పరిధిలో ఉన్న ఆదివాసీలందరూ పాడేరు ITDA పరిధిలోనే, ఇదివరకు ఉన్నట్టుగానే భావించి సేవలందించాలని కోరుతూ ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
శ్రీకాకుళం జిల్లాలోని సీతంపేట ITDA ఇప్పుడు మన్యం జిల్లాలో కలిసిన శ్రీకాకుళం జిల్లాలో ఉండిపోయిన మెలియాపుట్, భామిని, హీర మండలం, పాతపట్నం వంటి మండలాలలో ఉన్న ఆదివాసీలకు సేవలు అందిస్తుందని అదేవిధంగా, కాకినాడ జిల్లాలో ఉన్న ఆదివాసీలకు రంపచోడవరం ITDA, విజయనగరం జిల్లాలో ఉండిపోయిన ఆదివాసీలకు పార్వతీపురం ITDA, అనకాపల్లి జిల్లాలో ఉండిపోయిన ఆదివాసీలకు పాడేరు ITDA యధావిధిగా సేవలు అందించాలని ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవోను విడుదల చేసి ఆదివాసీలకు ప్రభుత్వ అధికారులకు స్పష్టత ఇవ్వాలని అజయ్ కళ్ళం గారిని కోరడం జరిగింది. ఇదే విషయమై వారికి ఒక వినతిపత్రం అందజేసి గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ తోను, చీఫ్ సెక్రటరీ తోను మాట్లాడాలని ప్రత్యేకంగా అభ్యర్థించడం జరిగింది. దీనికి అజయ్ కళ్ళం గారు సానుకూలంగా స్పందిస్తూ ప్రభుత్వంతో మాట్లాడుతామని హామీ ఇచ్చారు.
జై ఆదివాసి… జై జై ఆదివాసి