Sunday, December 22, 2024

తెలంగాణలో అమెజాన్ అతి పెద్ద పెట్టుబడి

  • రాష్ట్రంలో 20 వేల 761 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్న అమెజాన్
  • పెద్ద ఎత్తున డాటా కేంద్రాల ఏర్పాటు
  • దావోస్ లో కేటీఆర్ ప్రకటన, అమెజాన్ అధికారులతో సమాలోచన

దావోస్ : తెలంగాణరాష్ట్రానికి అత్యంత భారీపెట్టుబడి మరొకటి వచ్చింది. ప్రముఖ ఐటీ కంపెనీ అమెజాన్ తన వెబ్ సర్వీసెస్  ద్వారా తెలంగాణ రాష్ట్రంలోభారీగా పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా అమెజాన్ వెబ్ సర్వీసెస్ డాటా సెంటర్ ను తెలంగాణలోఏర్పాటుచేయనున్నది.ఈ అమెజాన్ వెబ్ సర్వీసెస్ డాటా సెంటర్ పరిథిలో మూడు ఏజెడ్ లు ఉంటాయని తెలిపింది. అమెజాన్ ఏర్పాటు చేయబోతున్న ఏషియా-పసిఫిక్ హైదరాబాద్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ రీజియన్ 2022 ప్రథమార్థంలో తనకార్యకలాపాలను ప్రారంభించే అవకాశం ఉంది. అమెజాన్ ఏర్పాటు చేయబోతున్నఅవైలబిలిటీ జోన్లలో పెద్ద ఎత్తున డాటాసెంటర్లను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపింది. ఇవన్నీఒకటే రీజియన్లో ఉన్నప్పటికీ, అదే సమయంలో ప్రతీ డేటా సెంటర్ దేనికదే స్వతంత్రంగా పనిచేస్తుందని, తద్వారావిద్యుత్ సరఫరాలో అంతరాయం, వరదలు, వర్షాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు నుంచి రక్షణ ఉంటుందని ఈ సందర్భంగా తెలిపింది. 

amazon big investment in telangana, data centre to be in hyderabad

డాటా సెంటర్లకు ఆటపట్టు తెలంగాణ

అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఏర్పాటు చేయబోతున్న డేటా సెంటర్లను సుమారు 20 వేల 761 కోట్లరూపాయలుఅంటే 2.77 బిలియన్ డాలర్లతో మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేయబోతోంది. అమెజాన్ వంటి అత్యంత ప్రఖ్యాత సంస్థ ఇంత భారీ ఎత్తున తెలంగాణలోడాటాసెంటర్ల ఏర్పాటుకు పెట్టుబడి పెడుతున్ననేపథ్యంలో.. రానున్నరోజుల్లో తెలంగాణ డాటాసెంటర్ల పెట్టుబడులకు ఆకర్షణీయ కేంద్రంగామారే అవకాశం ఉన్నది. 

తెలంగాణలో ఏర్పాటవుతున్న అమెజాన్ వెబ్ సర్వీసెస్ డాటా సెంటర్ల ద్వారా తెలంగాణ డిజిటల్ ఎకానమీ, ఐటీరంగం అనేక రెట్లు వృద్ధి సాధించే అవకాశం ఉన్నది. ప్రస్తుతం అమెజాన్ ఏర్పాటు చేస్తున్న ఏషియా-పసిఫిక్ రీజియన్ వెబ్ సర్వీసెస్ వలన వేలాదిమంది డెవలపర్లకు, స్టార్ట్అప్లకి, ఇతర ఐటీకంపెనీలకు, విద్య, తదితర రంగాల్లో పనిచేస్తున్న ఎన్జీవోలు, అనేక ఇతర కంపెనీలకు తమ వెబ్ఆధారిత సర్వీసులను నడుపుకునెందుకు వీలుకలుగుతుంది.

భారీ ఎత్తున డాటా సెంటర్లు

భారీఎత్తున డేటాసెంటర్లు అందుబాటులోకి రానున్ననేపథ్యంలోఈకామర్స్ , పబ్లిక్సెక్టార్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్సర్వీసెస్, ఐటి, ఇతర అనేకరంగాల్లో తమ కార్యకలాపాల విస్తృతి పెరిగేందుకు అవకాశం కలుగుతుంది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ద్వారా సుమారు 20 వేల 76 కోట్ల రూపాయలు పెట్టుబడిగా తెలంగాణ రాష్ట్రంలోకి రావడం పట్ల పరిశ్రమలు, ఐటీ శాఖమంత్రి కే. తారకరామారావు హర్షం వ్యక్తం చేశారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ పెట్టుబడికి సంబంధించి ప్రాథమిక చర్చలను దావోస్ పర్యటనలో ప్రారంభించినట్లు మంత్రి కేటీఆఆర్ తెలిపారు. దావోస్ పర్యటనలోఅమెజాన్ సంస్థ ఉన్నత స్థాయి ప్రతినిధులతో ఇందుకు సంబంధించి చేసిన చర్చలను ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు.

amazon big investment in telangana, data centre to be in hyderabad

ఇది అతి పెద్ద విదేవీ పెట్టుబడి 

అమెజాన్ వెబ్ సర్వీసెస్ ద్వారా రాష్ట్రానికి వస్తున్న ఈ పెట్టుబడి తెలంగాణ  రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలోకి వస్తున్న అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి  అని మంత్రి కేటీఆర్ తెలియజేశారు. ఈ పెట్టుబడి తర్వాత అనేక కంపెనీలు తమ డాటా సెంటర్ల ఏర్పాటుకు తెలంగాణ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని, అలాంటి వారందరికీ తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ సహకారాన్ని అందిస్తుందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అమెజాన్ లాంటి ప్రఖ్యాత కంపెనీ తన భారీ పెట్టుబడికి తెలంగాణను ఎంచుకోవడం అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పారదర్శక, వేగవంతమైన పరిపాలనకు నిదర్శనం అని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు.

అమెజాన్ అతిపెద్ద కార్యాలయం హైదరాబాద్ లో

తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న అనేక ఆదర్శవంతమైన విధానాలు, పాలసీల ద్వారా ఐటి, ఐటీ ఆధారిత రంగం పెద్దఎత్తున వృద్ధి చెందుతూ వస్తోందన్నారు. అందులో భాగంగానే అమెజాన్ తన పెట్టుబడిని తెలంగాణలో పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వ విధానాల ద్వారా ఐటీ రంగంలో అనేక కంపెనీలు రావడంతో పాటు ఇన్నోవేటివ్ స్టార్టప్స్ కు, నైపుణ్యం కలిగిన మానవ వనరులకు కేంద్రంగా తెలంగాణ రాష్ట్రం మారిందన్నారు. ఈ పెట్టుబడి ద్వారా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి అమెజాన్ కి మధ్య ఉన్న బంధం మరింత బలోపేతం అవుతుందని విశ్వాసం వ్యక్తంచేశారు. ఇప్పటికే అమెజాన్ తన అతి పెద్దకార్యాలయానికి హైదరాబాద్ కేంద్రంగాఎంచుకున్నవిషయాన్ని ఈసందర్భంగా మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles