నేను నిలబడడానితొక్కనవసరం లేకుండా చూడు
నాడు నా తాతలు తమను తొక్కేశారని
నేడు వాళ్లకు నన్నుతొక్కే హక్కు లేకుండా చూడు
నాడు వారికి చదువుకునే అవకాశం ఇవ్వలేదని
నేడు వారిలా ఉచితంగా చదువుకునే
అవకాశం నాకు లేకుండా చేస్తావా
నాడు వారికి ఉద్యోగాలు రాలేదని
నేడు వారికి అవకాశాలు ఇచ్చి
నాకు రాకుండా చేస్తావా
నాడు తమను ఎదగనివ్వలేదని
నేడు చట్టబద్ధంగా నా అవకాశాలు దోచుకోనిస్తావా
నా వాళ్ళు తప్పు చేసారని
నాకు శిక్ష పడకుండా చూడు
నిజాయతీగా అబివృద్ధి సాధించే నా ప్రయత్నాలను
కులాలు మతాలు కొల్లగొట్టకుండా కాపాడు
నలుగురితో సుఖంగా సాగే నా ప్రయాణాన్ని
పార్టీల పేరున ప్రయాసగా మార్చవద్దు
జగతిన ప్రగతి, సుఖ శాoతుల జీవన జ్యోతిని
స్వార్ధ తిమిరాలు ఆర్పేయకుండా కాపాడు
కులాన్ని వృత్తి నైపుణ్యం కోసం కాకుండా
రాజకీయం కోసం వాడుకోకుండా చూడు
మతాన్ని మత్తుమందులా కాకుండా
ఆధ్యాత్మిక సాధనకు ఉపయోగించుకొనేలా చూడు
Also read: స్వేచ్ఛ
Also read: మానవ జీవితంలో మార్గదర్శి భగవద్గీత
Also read: మొబైల్ లెట్రిన్స్
Also read: మానవ హక్కులు
Also read: ప్రమిద