2024-25 బడ్జెట్ లోప్రయాణికుల సౌకర్యం కోసం 790 కోట్లు
జీఎం అనిల్ కుమార్ జైన్ వెల్లడి
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో జరుగుతున్న పనులకు నిధుల కొరత లేకుండా కేంద్రం బడ్జెట్ లో కేటాయింపులు చేసిందని జీఎం అనిల్ కుమార్ జైన్ వెల్లడించారు. శుక్రవారం సికింద్రాబాద్ రైల్ నిలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దక్షిణ మధ్య రైల్వేకి నిధులు వెచ్చించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. పనులు వేగవంతం చేస్తామని అయన భరోసా వ్యక్తం చేసారు. జరుగుతున్న పనుల వివరాలు వెల్లడించారు. 24-25 బడ్జెట్ లో 14.232.84 కోట్ల రూపాయలు తెలుగు రాష్ట్రాలకు కేటాయించారని తెలిపారు. కొత్త గా రెండు డబలింగ్ లైన్ తోపాటు, ప్రధాన పట్టణాల ముందు బైపాస్ లైన్ మార్గాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. భద్రాచలం రోడ్డు, డోర్నకల్ మధ్య డబలింగ్ లైన్ కోసం 770.12 కోట్లతో 57 కిలోమీటర్లు అభివృద్ధి చేస్తారు. దక్షిణ మధ్య రైల్వే లో డబలింగ్ తోపాటు మూడవ లైన్ ఏర్పాటు కు 2.905 కోట్లతో సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. మిగిలిన విద్యుత్ తీగల పనులకు 224.59 కోట్లు ఖర్చు చేస్తున్నారు. సిగ్నల్స్, కమ్యూనికేషన్ కోసం 302 కోట్లు ఖర్చు చేస్తారు. రైల్వే లైన్ భద్రత పర్యవేక్షణ కోసం 891 కోట్లు, లైన్లు పునరుద్దరణ కోసం 1530 కోట్లు, ఆర్వోబీ, ఆర్యుబీ పనులకు 740 కోట్లు, నడికుడి, శ్రీకాళహస్తి పనులకు 450 కోట్లు, మనోహరాబాద్, కొత్తపల్లి పనులకు 350 కోట్లు, కోటిపల్లి / నర్సాపూర్ లైన్ పనులకు 300 కోట్లు, విజయవాడ /గూడూరు మధ్య మూడవ లైన్ కోసం 500 కోట్లు, ఖాజీపేట /విజయవాడ మధ్య మూడవ లైన్ కోసం 310 కోట్లు, ఖాజీపేట / భద్రాచలం మధ్య మూడవ లైన్ కోసం 300 కోట్లు, గుంటూరు / గుంతకల్ మధ్య డబలింగ్ కోసం 283 కోట్లు, గుంటూరు, బీబీనగర్ మధ్య డబలింగ్ కోసం 200 కోట్లు, గుత్తి – పెండెకల్లు మధ్య డబలింగ్ కోసం 150 కోట్లు, భద్రాచలం, డోర్నకల్ మధ్య డబలింగ్ కోసం 100 కోట్లు, జంట నగరాల మధ్య ఎం ఎం టీ ఎస్ సెకండ్ ఫేస్ కు 10 కోట్లు కేటాయించారు. మీడియా సమావేశం లో సీ పీ ఆర్ ఓ రాకేష్, అనిల్, రాజేష్ పాల్గొన్నారు.