కొత్త వ్యవసాయ బిల్లులపై రైతులు మతాలకు అతీతంగా పోరాడడం ద్వారా లౌకికత్వాన్ని ప్రదర్శిస్తున్నారని,అది పాలకు లకు భయంగా మారిందని అఖిల భారత కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్ల అన్నారు. 70 కోట్ల మంది రైతులు కష్టించి దేశానికి అన్నం పెట్టే దేశభక్తులే తప్ప ఎవరికో ఏజెంట్లు కాదని,వారికి కులమత ప్రాంత భేదాలు లేవని మీడియా సంస్థతో అన్నారు.
కార్పొరేట్ దిగ్గజాలు అంబానీ,అదానీల ఒత్తిడితోనే ప్రభుత్వం కరోనా కాలంలోనూ ఆగమేఘాల మీద ఈ ఆర్డినెన్స్ లు తెచ్చిందని, ఇవి రైతులకు మృత్యుఘంటికల వంటివి ముందు నుంచి చెబుతూనే ఉన్నామని అన్నారు. ఈ చట్టాల వెనుక వ్యాపార, వాణిజ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి కానీ నిజంగా వ్యవసాయానికి మేలు చేసేవి కావని ఆయన అన్నారు.
చర్చలు లేకుండానే చట్టాలు
రైతు సంఘాలతో కానీ,రైతులతో కానీ ఎలాంటి చర్చలు జరపకుం డానే కేంద్రం ఈ చట్టాలు తెచ్చిందని హన్నన్ అన్నారు. చట్టాలు తేవడంలో ప్రభుత్వం తమతో సంప్రదించకపోయినా, చర్చలకు వ్యతిరేకం కాదని,అందుకే వాటిలోని లోపాలను ఎత్తిచూపి వాటిని రద్దు చేయించాలని తాము చర్చలకు సిద్ధమయ్యామని తెలి పారు. తాము ఆరు నెలలుగా ఆందోళన చేస్తున్నా ఇప్పటి వరకు చర్చలకు ఎందుకు పిలవలేదో ప్రధాన మంత్రే చెప్పాలని అన్నారు.