ఒక్క క్లిక్కుతో
కాలాన్ని ఆపేసిన
ఆ వేళ్లు ఇప్పుడెక్కడున్నాయో!
ఒక్క చూపుతో
దృశ్య రహస్యాన్ని కనిపెట్టిన
ఆ దర్శనం ఎంత పదునైనదో!
Also read: అడుగులు
ఆల్బంలో
ఫోటోలు కదలవు.
కాని క్షణాలను కదిలించి
జ్ఞాపకాలుగా మారుస్తాయి.
Also read: వంటిల్లు
ఒకప్పుడు మా ఊరిలో
ఫోటో దిగడానికి
మైలు దూరం నడిచే వాణ్ని.
అప్పటి ఫోటోలో
నేరేడు పండ్లలాంటి కండ్లతో
ఓ కుర్రాడిని మీరు పోల్చుకోవచ్చు.
Also read: శైలారోహణ– అమండా గోర్‌మన్
ఆనాటి ఫోటోలన్నీ
అపురూప మనోహరాలే అయినా
రూపురేఖల్లో
వయస్సులు తెచ్చిన మార్పులు
తులనాత్మక కుతూహల రమ్యంగా వుంటాయి.
ఆల్బం కేవలం
నీడల గ్యాలరీ కాదు.
Also read: స్ఫురణ
ఒక ఆగిపోని చరిత్ర,
అద్దం లాంటిదే కాని
ఒక అంతర్గత సృజనాత్మక బాహ్యరేఖ.
ఎప్పటికీ ఆరిపోని
సౌందర్య జ్వలన శిఖ.
Also read: స్తబ్ధకోశం
ఫ్యామిలీ ఫోటోలో
కొందరు పెద్దవాళ్లైపోయారు.
కొందరు అర్థాంతరంగా నిష్క్రమించారు.
అయితే వారి ముఖ రోచిస్సులు
కాలం గాలికి చెదిరిపొయ్యేవి కాదు.
Also read: రైతు భారతం
మా పాతింటిలో
అమ్మానాన్నల
అరుదైన ఫోటోల కోసం
సంవత్సరాల పాటు వెతికాం.
అవి దొరికిన రోజు
ఈ ఆల్బం జన్మ ధన్యమైంది.
కొన్ని పుటలెందుకో
ఖాళీగా కనిపిస్తున్నాయి
కుటుంబంలోని
ఆత్మీయ దొంగల పని కావొచ్చునది.
దీని పుటలు తిరగేసినప్పుడల్లా
గది నిండా
ఒక రకమైన పరిమళాలు,
అవి తరతరాల
అనుబంధ సుగంధాలని వేరే చెప్పాలా!
మా బ్లాక్ అండ్ వైట్ ప్రపంచంలోకి
ఈ మధ్య
రంగుల తుఫానులు వీస్తున్నాయి.
నో ప్రాబ్లమ్
రంగుల దేముంది
జీవితం రంగు వెలిసి పోకుంటే చాలు.
Also read: అయ్యో!