- బెయిల్ పిటీషన్ తిరస్కరించిన సికిందరాబాద్ కోర్టు
- అరెస్టు వెనుకు రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయన్న భూమా మౌనిక
ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు కోర్టులో ఎదురుదెబ్బతగిలింది. తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన బోయినపల్లి కిడ్నాప్ కేసులో ఆమె పెట్టుకున్న బెయిల్ పిటీషన్ ను సికింద్రాబాద్ కోర్టు తిరస్కరించింది. అఖిల ప్రియ వైద్య పరీక్షల నివేదికలను చంచల్ గూడ జైలు అధికారులు కోర్టుకు సమర్పించారు. నివేదికను పరిశీలించిన అనంతరం కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.
ఇది చదవండి: కేసీఆర్ పెద్దరికం చేయండి..మా అక్క ప్రాణాల్ని కాపాడండి
మరోవైపు కిడ్నాప్ కేసులో సమగ్రంగా విచారించేందుకు అఖిల ప్రియను తమ కస్టడీకి అప్పగించాలని పోలీసుల విజ్ఞప్తిని కోర్టు అనుమతినిచ్చింది. అయితే 7 రోజుల కస్టడీ కావాలని పోలీసులు కోరగా కేవలం మూడు రోజుల కస్టడీకి మాత్రమే అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రోజు నుంచి (జనవరి 11) నుంచి 13 వరకు అఖిల ప్రియను కస్టడీలోకి తీసుకుని పోలీసులు విచారించనున్నారు.
ఇది చదవండి: గంటకో మలుపు తిరుగుతున్న బోయిన్ పల్లి కిడ్నాప్ ఉదంతం
మరోవైపు అఖిల ప్రియ భర్త భార్గవ రామ్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. భార్గవ రామ్ ఆచూకీ తెలియకపోవడంతో ఆయన తల్లిదండ్రులపై పోలీసులు ఒత్తిడి పెంచుతున్నారు. అయితే అఖిలప్రియ అరెస్టు వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని ఆమె సోదరి భూమా మౌనిక ఆరోపిస్తున్నారు.
ఇది చదవండి: భూమా అఖిలప్రియ అరెస్టు