Sunday, December 22, 2024

అక్బరుద్దీన్ కు నాంపల్లి కోర్టు ఊరట

  • భవిష్యత్తులో అటువంటి వ్యాఖ్యాలు చేయవద్దని హీతవు
  • కేసు గెలిచినందుకు సంబరాలు చేసుకోవద్దు

 ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ వివాదాస్పద వాఖ్యల కేసులో నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పును వెల్లడించింది. అక్బరుద్దీన్‌పై నమోదు అయిన రెండు కేసులను కోర్టు కొట్టివేస్తూ బుధవారం తీర్పు ఇచ్చింది. తొమ్మిదేళ్ల కిత్రం నిజామాబాద్‌, నిర్మల్‌లో  మతవిద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారంటూ  అక్బరుద్దీన్‌ ఒవైసీపై కేసు నమోదైంది. ఈ కేసులో 30 మంది సాక్షులను న్యాయస్థానం విచారించింది. ఈ కేసులో గతంలో అరెస్టైన అక్బరుద్దీన్‌ 40 రోజుల పాటు జైల్లో ఉన్నారు. బుధవారం ఈ మేరకు తీర్పు వెల్లడించిన నాంపల్లి కోర్టు.. కేసులను కొట్టేస్తూ అక్బరుద్దీన్‌ను నిర్దోషిగా ప్రకటించింది. అంతేకాదు భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి చేయొద్దని, అలాంటి వ్యాఖ్యలు దేశ సమగ్రతకు మంచిదికాదని కోర్టు వ్యాఖ్యానించింది. అలాగే కేసు కొట్టివేసినంత మాత్రానా సంబురాలు చేసుకోవద్దని కోర్టు ఆదేశించింది. కోర్టు తీర్పు నేపథ్యంలో.. పాతబస్తీలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles