* అప్ఘన్ లెగ్ స్పిన్నర్ రషీద్ సంచలనం
* జింబాబ్వేతో టెస్టులో అలుపెరుగని బౌలింగ్
ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో ప్రపంచ నంబర్ వన్ బౌలర్ గా పేరుపొందిన అప్ఘనిస్థాన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్..సాంప్రదాయ టెస్టు క్రికెట్లో సైతం తన సత్తా చాటుకొన్నాడు.
కేవలం నాలుగు ఓవర్లకే పరిమితమయ్యే టీ-20 ఫార్మాట్లో ఇప్పటికే పలు అరుదైన రికార్డులు నెలకొల్పిన రషీద్ సుదీర్ఘంగా సాగే టెస్టు ఇన్నింగ్స్ లో సైతం.. పలుపు సొలుపు లేకుండా బౌలింగ్ చేసి…తనకుతానే సాటిగా నిలిచాడు.
Also Read : విజయ్ హజారే ట్రోఫీ విజేత ముంబై
జింబాబ్వేతో రెండుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా అబుదాబీ షేక్ జాయేద్ స్టేడియంలో ముగిసిన రెండోటెస్టు మ్యాచ్ రెండు ఇన్నింగ్స్ల్ లోనూ కలసి రషీద్ ఖాన్ రికార్డు స్థాయిలో 99.2 ఓవర్ల బౌలింగ్ పూర్తి చేశాడు.
21వ శతాబ్దంలో అత్యధిక ఓవర్లు బౌల్ చేసిన టెస్టు బౌలర్ గా చరిత్ర సృష్టించాడు.
తొలి ఇన్నింగ్స్ లో 36.3 ఓవర్లలో 138 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టిన రషీద్…రెండో ఇన్నింగ్స్ లో 62.5 ఓవర్ల బౌలింగ్ చేసి 3 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్ గా 99.2 ఓవర్ల మారథాన్ బౌలింగ్ తో 7 వికెట్లు పడగొట్టి తనజట్టు విజయానికి బాటలు వేశాడు.
Also Read : లెజెండ్స్ సిరీస్ లో మాస్టర్ క్లాస్
నాడు మురళీ- నేడు రషీద్ ఖాన్
టెస్టు చరిత్రలోనే అత్యధిక ఓవర్లు బౌల్ చేసిన బౌలర్ రికార్డు శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ పేరుతో ఉంది. 1998 సీజన్లో ఓవల్ వేదికగా ఇంగ్లండ్ తో ముగిసిన ఓ టెస్టులో మురళీధరన్ 113.5 ఓవర్లు మేర బౌలింగ్ చేశాడు.
అయితే…కొత్త శతాబ్ది తొలి సంవత్సరం టెస్టు సీజన్లోనే పసికూన అప్ఘనిస్థాన్ లెగ్ స్పిన్నర్ 99.2 ఓవర్ల బౌలింగ్ తో అరుదైన ఈ ఘనత సొంతం చేసుకోగలిగాడు.
Also Read : టీ-20ల్లో చహాల్ సరికొత్త రికార్డు