సమానత్వం అన్నిట్లో కావాలి
రాజ్యాంగం ఇచ్చింది రాజకీయ సమానత్వం
సమాజం అగ్ర, హీన కులాలుగా విడిపోయింది
కుటుంబం మగ ఆడ అంటూ గీతలు గీసింది
ఆర్ధిక స్వాతంత్ర్యం అంటూ కొందరికి ప్రాధాన్యం
సోషలిస్టు రాజ్యమంటూ
కష్టపడేవారిని దోచి
సోమరులకు పంపకం
సామాజిక స్పృహ అంటూ
వర్గ పోరాటం ప్రోత్సహించడం
ఓటు బ్యాంకు రాజకీయాలతో
కుల మతాలను వాడుకోవడం
విగ్రహాలు ధ్వంసం చేయడం
దేవుడి ఆస్తులను మింగడం
సమత పేరున పాలకులపై వ్యతిరేకత పెంచడం
సంస్థలన్నీ ప్రభుత్వ ఆయుధాలని
న్యాయస్థానాలు న్యాయం చెయ్యవని
యువతను రెచ్చగొట్టి
ఉగ్రవాదులుగా మార్చే కళాశాలలు
రోడ్లు వెయ్యనివ్వని తీవ్రవాదులు
బడులు కాల్చే ఉగ్రవాదులు
అందరూ సమత గురించి చెబుతారు
లేనివాడికి రూపాయి ఇచ్చే
మమత మాత్రం కనిపించడం లేదెక్కడా!
Also read: అప్పుడు
Also read: లీలాకృష్ణ
Also read: వందనం
Also read: సజీవ శిల్పం
Also read: సంస్కృతం