Sunday, December 22, 2024

ప్రకటనల మాయాజాలం

భగవద్గీత – 51

1922 లో రేడియోను కనుక్కున్నారు. దాని ఉపయోగం, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బాగా కనబడింది. అటు జర్మనీలో నాజీలు, ఇటలీలో ఫాసిస్టులు, రష్యాలో కమ్యూనిస్టులు తమతమ సిద్ధాంతాలను ప్రచారం చేసుకోవటానికి, ప్రజాభిప్రాయాన్ని సామూహికంగా మలచటానికి విస్తృతంగా వినియోగించారు.

మనస్తత్వ శాస్త్రజ్ఞుడైన సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌ దగ్గరి బంధువు ఎడ్వర్డ్‌ బెర్ని అనే ఆయన మనస్తత్వానికి అనుగుణంగా సమాచార మార్పిడి అనే విషయం మీద విస్తృత పరిశోధన చేశాడు. మనుషులలో అంతర్లీనంగా ఉన్న భావాలను ప్రేరేపించి వస్తు వినియోగాన్ని వృద్ది చేయడం ఎలా అన్నదాని మీద ఒక సిద్దాంతాన్ని లేవదీశాడు.

Also read: ఆహార నియమాలూ, ఆరోగ్యం

అదేమిటంటే ‘‘అవసరాన్ని సృష్టించు, తదనుగుణంగా ఉత్పత్తి చేసి విక్రయించు ‘‘ ఇదిగో ఈ సూత్రమే వ్యాపార ప్రకటనలకు మూలాధారం.

He writes in his book propaganda… If we understand the mechanism and motives of group mind, is it not possible to control and regiment the masses according to our will without their knowing about it…

మన ఇళ్ళలో మొదట రేడియో కొనుక్కున్నాం. అందులో మనిషి గొంతుక మాత్రమే వినపడేది. మనిషి కనపడడుకదా! కాబట్డి రూపము, స్వరము రెండూ కావాలి అనే అవసరం సృష్టించారు.  అంతే టీవీ ఉత్పత్తి అయ్యింది.

Also read: అసురీ ప్రవృత్తి అనంత రూపాలు

అబ్బే నలుపు, తెలుపులో దృశ్యం ఉంటే ఏం బాగుంటుంది?

రంగుల లోకాన్ని రంగులలోనే చూపించాలి అనే ఆలోచన వచ్చింది. అంతే రంగుల టీవీ ప్రత్యక్షం అయ్యింది. దృశ్యం అన్ని వైపుల నుండి కూడా బాగా కనబడాలి అనే అవసరం గుర్తుకొచ్చింది. అంతే Flat TV పుట్టుకొచ్చింది. దృశ్యం శబ్దం ఇంకా వాస్తవానికి దగ్గరగా ఉంటే, ఈ ఆలోచన ICD TV కి జన్మయిచ్చింది. అక్కడ నుండి LED TV, OLED, Curve TV, దాంట్లో వివిధ పరిమాణాలు లంకంత కొంపలో గోడకు సరిపోయినంత టీవీలు పుట్టుకొచ్చాయి. కార్లు, ఫొన్స్‌, చివరికి టూత్‌ బ్రష్‌ లు కూడా ఎంత రూపాంతరం చెందాయో చూడండి.

ఒక్క క్షణం ఆగి మన ఇళ్ళలో మనమే ఒకే వస్తువును ఎన్నిసార్లు మార్చామో ఆలోచించండి. అప్పుడే ఈ మార్కెట్‌ మాయాజాలం మనకు అర్ధమవుతుంది. కొనుగోలుశక్తి తగ్గుతున్నది అనుకున్నప్పుడు విరివిగా రుణాలు ఇవ్వడం, అప్పుల భారం తలకెత్తడం ఇంకొక ప్రక్రియ. జనంతో కొనిపించడం ఆర్ధిక వ్యవస్థను ముందుకు పరుగెత్తించడం. దానికి మనము పెట్టుకున్న ముద్దు పేరు ‘‘ఆర్ధిక ప్రగతి’’. Growth engine has started chug chugging అని పేరుపెట్టడం, దానికోసం వడ్డీ రెట్లు పెంచడం, తగ్గించడం ముందుకు వెనుకకు జరపడం అంతా ఒక మాయాజాలం ఇదంతా ఎందువలన? విషయ వాంఛల వలన ఉత్పన్నమైన ఒక గొప్ప గందరగోళం.

Also read: వివాహ వేడుకలో అపశ్రుతులు

ధ్యాయతే విషయాన్‌ పుంసః సంగస్తేషుపజాయతే

సంగాత్‌ సంజాయాతే కామః కామాత్‌ క్రోదోభిజాయతే

విషయములను, భోగములను గురించి సదా ఆలోచించే మనుష్యుడు వాని యందు ఆసక్తి పెంచుకొంటాడు. ఆ ఆసక్తి వలన, ఆ విషయములపట్ల కోరిక ఉదయిస్తుంది. ఆ కోరిక తీరకపోయిన ఎడల క్రోధం జనియిస్తుంది. క్రోధము నుండి మూఢ భావం జన్మిస్తుంది. దాని వలన మనిషి స్మరణశక్తీ కోల్పోతాడు, బుద్ది నశించి పతితుడవుతాడు.

ఇంద్రియాలను తన అధీనంలో ఉంచుకొన్న మానవుడు ప్రసన్నమైన ప్రసాదబుద్ది కలిగి ఉంటాడు.

stress free life! వత్తిడి ఎక్కడ?

We don’t need stress management classes. `ప్రాప్తంబగు లేశమైన పదివేలనుచున్‌ తృప్తిన్‌ చెందని మనుజుడు సప్త ద్వీపములనైన చక్కం బడునే!` అని అంటారు పోతనామాత్యులవారు.

ఆపూర్యమాణం అచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్‌

తద్వాత్కామాయం ప్రవిశంతి సర్వేస శాంతి మాప్నోతి న కామ కామీ

ఎన్నో నదులలో నుండి నీరు సముద్రాన్ని ప్రతి క్షణమూ చేరుతున్నది. అయినప్పటికీ సముద్రమట్టం పెరగటంలేదు. సముద్రుడు చెలియలికట్ట దాటడం లేదు. అదే విధంగా ఎన్ని విషయ భోగాలు ఊరించినా, ఎవరిలో వికారం కలగకుండా ఉంటుందో వాడే నిజమైన శాంతిని పొందగలుగుతాడు. కాబట్టి ప్రకటనల మాయాజాలంలో కొట్టుకుపోకుండా మనని మనం కాపాడుకుందాం. మనశ్శాంతిని పెంచుకుందాం.

Also read: మన ప్రవృత్తి ఏమిటి?

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles