Sunday, December 22, 2024

ఆదివాసీ యువతిని వివస్త్రను చేసిన అటవీశాఖ ఉద్యోగిని బర్తరఫ్ చేయాలి: ప్రగతిశీల మహిళా సంఘం డిమాండ్

కొత్తగూడెం:  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం ఆదివాసీ గూడెం సాకివాగు వలసకు చెందిన ముగ్గురు మహిళలు వంటచెరుకు కోసం అడవిలోకి వెళ్ళగా ఫారెస్ట్ గార్డ్ మహేశ్ వారిపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. భయంతో పరుగులు తీస్తున్న మహిళలను వెంటపడి మరీ కొట్టాడు. నీళ్ళమడుగులో పడిపోయిన సోడె దేవమ్మ అనే 16 సంవత్సరాల ఆదివాసీ యువతిని లంగాతో సహా బట్టలను గుంజి వివస్త్రను చేశాడు. ఇతని దాడిలో  ఆదివాసీ మహిళలు ఎట్టి లక్ష్మి, సోడె రజనిలు తీవ్రంగా గాయపడ్డారు.

టీఆరెస్ ప్రభుత్వం ఒక వైపు పోడుభూములకు పట్టాలిస్తామని నమ్మబలుకుతూ మరోవైపు ఆదివాసీలపై దాడికి ఉసికొల్పుతున్నది. అడవిలో నివసిస్తున్న ఆదివాసులకు పొయిల కట్టెలు తెచ్చుకొనే హక్కు లేదా? ఏ అధికారంతో ఫారెస్టు గార్డు మహిళలపై విచక్షణా రహితంగా దాడిచేశాడు? అటవీ హక్కుల చట్టంతో సహా అనేక చట్టాలు అడవిపై ఆదివాసీలకు హక్కులు కల్పించాయి. రాజ్యాంగ బద్ధమైన హక్కులు ఎన్నో వారి రక్షణకు ఉన్నాయి. అవి అమలు చేయవలసిన యంత్రాంగాలే ఇక్కడ ఉల్లంఘిస్తున్నాయి,  నిరంతరం దాడులకు పాల్పడుతున్నాయి. ఎన్నో ఎన్నికల హామీలిచ్చిన ప్రభుత్వాలు ఆదివాసీలను అడవినుండి వెళ్ళగొట్టి, అటవీ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే చర్యలకు పూనుకొంటున్నాయి. ఆదివాసీ, గిరిజనులపై జరుగుతున్న దాడులు అందులో భాగమే స్పష్టం చేస్తున్నామంటూ ప్రగతిశీల మహిలాసంఘం జాతీయ కన్వీనర్ వి. సంధ్య ఒక ప్రకటనలో అన్నారు.

మహిళపట్ల అవమానకరమైన ప్రవర్తన, దాడులు, లైంగిక వేధింపులను నిరోధిస్తూ దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న చట్టాలను పాలకులే తుంగలో తొక్కడాన్నిప్రగతిశీల మహిళా సంఘం తీవ్రంగా ఖండిస్తోందని ఆమె చెప్పారు. ఆదివాసీ  మహిళలపై దాడిచేసి, యువతిని వివస్త్రను చేసిన ఫారెస్ట్ గార్డు మహేశ్ పై కఠిన చర్యలు తీసుకోవాలనీ, కేసులు నమోదు చేసి అతన్ని ఉద్యోగం నుండి తొలగించాలనీ సంధ్య డిమాండ్ చేశారు. ‘‘అడవిపై ఆదివాసీలకు ఉన్న హక్కులను గుర్తించాలనీ, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలనీ డిమాండ్ చేస్తున్నాం,’’ అని సంధ్య తన ప్రకటనలో అన్నారు.

సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles