- మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది
ముంబయిలో మరో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రెండురోజుల క్రితం ముంబయిలోని భాండూప్ ప్రాంతంలో గల ఓ ప్రైవేటు ఆస్పత్రిలో జరిగిన అగ్ని ప్రమాదం మరిచిపోకముందే మరో అగ్నిప్రమాదం జరిగింది. ముంబయి ప్రభాదేవి ప్రాంతంలో వీర్ సావర్కర్ రోడ్డులోని వాణిజ్య భవంతిలో ఈ రోజు ఉదయం ఘటన చోటు చేసుకుంది. తెల్లవారుజామున ప్రమాదం జరగడంతో ప్రాణ నష్టం జరగలేదని అదే రద్దీ సమయంలో జరిగితే భారీ ప్రాణనష్టం సంభవించేదని అధికారులు తెలిపారు
మంటలను అదుపు చేస్తున్న ఫైరింజన్లు:
ఐదు అంతస్థుల గామన్ హౌస్ బేస్‌మెంట్‌లో మంటలు చెలరేగినట్టుగా స్థానికులు తెలిపారు. అనంతరం మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మొత్తం ఎనిమిది ఫైరింజన్లు, ఏడు వాటర్ ట్యాంకర్ల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
Also Read: కోవిడ్ కేర్ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం
ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. షాక్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగిఉండొచ్చని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.