అంతర్జాతీయ చెస్ టోర్నీలో తెలంగాణ ప్రతిభ చాటిన అభిగ్యాన్అమెరికా చెస్ క్లబ్ అకాడమీ నిర్వహించిన ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ చెస్ టోర్నీలో ప్రధమ స్థానాన్ని సాధించి హైదరాబాద్ క్రీడాకారుడు వై.అభిగ్యాన్ రికార్డు సృష్టించాడు. హైదరాబాద్ కీర్తి ప్రతిష్టల్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాడు. ప్రతి ఏటా జులై 20న అంతర్జాతీయ చెస్ దినోత్సవం సందర్భంగా అమెరికా చెస్ క్లబ్ అకాడమీ ఈ టోర్నీ నిర్వహిస్తుంది. పది సంవత్సరాల లోపు పిల్లల గ్రూప్ లో అభిగ్యాన్ పోటీ పడ్డాడు. ఎంతో అనుభవం ఉన్న సాటివారిని తలదన్ని అభిగ్యాన్ ప్రధమ స్థానంలో నిలవడం పలువుర్ని ఆశ్చర్య పరచింది. అమెరికా నుంచి నేరుగా ఈ ట్రోఫీ నేడు అభిగ్యాన్ కు అందడంతో అతని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని ఇండస్ యూనివర్సల్ స్కూల్ లో అయిదో తరగతి చదువుతున్న అభిగ్యాన్ కేవలం పది నెలల కాలంలోనే చెస్ ఆడటం ప్రారంభించి అనతి కాలంలోనే అంతర్జాతీయ టోర్నీలో పాల్గొని ప్రధమ స్థానం సాధించడం తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణం. గతంలో జరిగిన బ్రిలియంట్ చెస్ టోర్నీ లో కూడా అభిగ్యాన్ ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. తన తల్లి వై శారద తనను అనునిత్యం ప్రోత్సహించిందని ఈ సందర్భంగా అభిగ్యాన్ తెలిపాడు. తనను తన తల్లి ప్రోత్సహించడం వల్లే ఈ టోర్నీలో విజయం సాధించినట్లు అభిగ్యాన్ తెలిపాడు.
Great child