Sunday, December 22, 2024

నిర్వికార సాక్షి

వాళ్ళంతా వాగ్ధాన కర్ణులే 

జనం ఘూర్ణిల్లే వేళ కుంభ కర్ణులే !

ప్రతి మాసం లో మోస పోతున్నాం 

అచ్చే దిన్ వస్తుందని 

మురిసిపోతుంటాం !

Also read: దేవుడా రక్షించు నా దేశాన్ని!

మన తాటాకు చప్పుళ్ళ కి 

కరోనా క్రిములు బెదురుతాయనకుంటాం !

కరోనా మూలాలు వేదాల్లో ఉన్నాయని 

విజ్ఞాన బ్రాంతి పొందుతాం !

Also read: నగరం

వీర బ్రహ్మం ఆనాడే చెప్పాడని 

తాటాకులు తిరగేస్తాం !

నేతలకి  ప్రకృతి ఉపద్రవం 

తగ్గగానే అధికార దాహం మొదలు 

బ్యాలెట్ పెట్టెలు నిండ గానే 

శవాల పెట్టెలు కూడా లేస్తుంటాయి. 

వ్యాక్సిన్,ఆక్సిజన్ 

మ్యూజియం లో వస్తువులవుతాయి 

పొరుగు దేశాలకి  ఎగుమతులు ఎగదోశినపుడు 

దేశం లో చితి జ్వాలలు చెలరేగుతాయి !

Also read: ఇండియా ప్రైవేట్ లిమిటెడ్

మద్య సరఫరా నిరంతర ప్రక్రియ 

మత్తు లో జోగే జాతి ప్రశ్నించదుగా 

యుద్దానికి  సన్నద్దం కాని వాళ్ళకి 

మరణ మృదంగ ధ్వని తప్పదు గా 

చెంచాడు శానిటైజర్,మూతి గుడ్డల 

తో జీవన గతి ఎటో ?

నిత్య మృత్యు నృత్యానికి 

ఇప్పుడు మనిషోక 

నిర్వికార సాక్షి !

Also read: మిత్రమా ఇక యుద్ధం అనివార్యమే !

([email protected])

వీరేశ్వర రావు మూల
వీరేశ్వర రావు మూల
సాహితి వివరాలు : 1985 నుంచి రాస్తున్నా. వివిధ పత్రికల్లో కధలు,కవితలు,కార్టూనులు వస్తున్నాయి. ఆంగ్లం లో కూడా వంద కి పైగా కవితలు వెబ్ పత్రికల్లో ప్రచురిత మయ్యాయి. వృత్తి : నిర్మాణ రంగం లో ఐటీ విభాగం మేనేజర్ ఉద్యోగం ఆంగ్లం లో Vibrations of my heart Amazon Kindle పుస్తకం గా ప్రచురణయ్యింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles