నేను వోటు వెయ్యడానికి
కావాలి ఒక నాయకుడు
కావాలి ఒక సమర్ధుడు
కావాలి ఒక నిజాయితీపరుడు
కావాలి ఒక మంచివాడు
కావాలి ఒక తెలివిమంతుడు
కావాలి ఒక చిత్తశుద్ధి కలవాడు
కావాలి ఒక ప్రజా సేవకుడు
కావాలి ముందుచూపు కలవాడు
కావాలి నిజం చెప్పేవాడు
కావాలి అందర్నీ సమంగా చూసేవాడు
కావాలి న్యాయం చేసేవాడు
నేను అతని కులం చూడను
నేను అతని మతం చూడను
నేను అతని ప్రాంతాన్ని చూడను
నేను అతని వంశం చూడను
నేను అతని చరిత్ర చూడను
అతనిచ్చే డబ్బులు నాకొద్దు
అతనిచ్చే సారా నాకొద్దు
అతనిచ్చే ఉచిత బిక్షం నాకొద్దు
అతనిచ్చే కాంట్రాక్టులు నాకొద్దు
అతనిచ్చే ఇల్లు నాకొద్దు
నా కోసం ఇంకోడిని దోచేవాడు నాకొద్దు
రాష్ట్రాన్ని దేశాన్ని ముంచేవాడు నాకొద్దు
నేను ఇచ్చే పన్నుల డబ్బు
అందరికి ఉపయోగ పడేట్లుగా
సక్రమంగా వాడేవాడు కావాలి
అదే అందరికీ కావలసింది
అదే నాయకుడు చెయ్యవలసింది.
Also read: “శుద్ధి”
Also read: “ఓట్ల పండగ”
Also read: శ్రీ శ్రీ
Also read: “జీవిత సాఫల్య పురస్కారం”
Also read: “పూజా ఫలం”