Sunday, December 22, 2024

గురువు ప్రసన్నుడై అనుగ్రహించేది జ్ఞానం

భగవద్గీత 20

మనకు చక్కని జ్ఞానం కలగాలంటే పెద్దలను, వృద్ధులను గురువులుగా చేసికొని వారి శుశ్రూష చేస్తూ సంపాదించుకోవాలి. `జ్ఞానం వృద్ధోపి సేవనమ్‌` అని ఆర్య చాణుక్యుడు చెపుతారు. వృద్దులు అంటే వయసు వృద్ధి చెందిన వారు కావచ్చు. వీరివద్ద వయసుతో పాటు జీవితం నేర్పిన పాఠాలు ఎన్నో ఉంటవి. అలాగే జ్ఞానం వృద్ధిపొందిన వారు కావచ్చు.

Also read: సర్వం బ్రహ్మమే

జ్ఞాన వృద్ధులు

వీరి వద్దకు మనం వెళ్ళి లాక్కుంటే వచ్చేదా జ్ఞానం? రాదు రాదు. ముమ్మాటికి రాదు. వాళ్ళవద్ద ఉన్న సంపదను బలవంతంగా లాక్కుని మన స్వంతం చేసుకోవచ్చు!

కాని జ్ఞానం అలా కాదే!

ఎదుటి వ్యక్తికి మన మీద ప్రసన్నత కలగాలి. ఆ ప్రసన్నత ఎప్పుడు కలుగుతుంది? ఆయనకు మన మీద, వీడికి నేనంటే భక్తి, వినయం ఉన్నది అనే భావన రావాలి. అప్పుడు ఆయన మానసికంగా మనకు ఏదయినా ఇవ్వటానికి సిద్ధపడతాడు.

ఆయన సిద్ధపడితే సరిపోతుందా?

సరిపోదు. అడగంది అమ్మయినా అన్నం పెట్టదు అనే సామెత ఉన్నది. కాబట్టి ఆయనను ఆయా విషయాల మీద అడిగి, ప్రశ్నించాలి. అప్పుడే ఆయన చెప్పటం మొదలు పెడతారు.

Also read: ఎవరు పండితుడు?

మరి ఒక రోజు ఒక ప్రశ్న వేసి సమాధానం తెలుసుకుని, ఓహ్ నాకు జ్ఞానం వచ్చేసింది అని అనుకోగలమా? ఎంత మాత్రం కాదు. నిరంతరము గురువుగారి సేవ చేస్తూ ఉంటే ఆయన మన పట్ల ప్రసన్నుడై మనకు అనుగ్రహించేది జ్ఞానం. ఈ process అంతా ఎలా జరగాలి? అంటే ఇదిగో ఈ విధంగా అని చెపుతున్నారు!

తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా

ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః సత్త్వదర్శినః

ప్రణిపాతము అంటే సాష్టాంగ దండప్రణామాలు ఆచరించడం. అంటే నేను మీకంటే చాలా అల్పుడిని గురువుగారూ అని కల్లాకపటం లేకుండా ఉండటం.

అంతే కానీ ఆవిధంగా కనపడాలని ప్రయత్నం చేయటం కాదు. మనసు నిష్కల్మషంగా ఉండాలి. అలాకాకుండా అంతరంగంలో అసౌకర్యంగా భావిస్తూ ఇట్లా క్రింద పడి ఎదుటి వారి కాళ్లు పట్టుకుంటే బయట జనం ఏమనుకుంటారో అని సిగ్గుపడుతూ చేయటం కాదు.

Dr Robert B Cialdini అని ఒకాయన The Psychology of Persuation అని ఒక పుస్తకం వ్రాశారు. అందులో ‘‘The reality of internal discomfort and external shame can produce a heavy psychological cost” అని చెపుతారు.

ఆ విధంగా జ్ఞానులను ప్రసన్నులను చేసుకొని వారిని ‘‘పరి ప్రశ్నేన’’ అంటె వినయంతో ప్రశ్నించి సేవ చేస్తే వారి వద్దనుండి ఈ జ్ఞానం నీవు పొందుతావు. జ్ఞానం పొందాలంటే మనని మనం ముందు సంస్కరించుకోవాలి కదా!

Also read: కోట్ల కణాల కుప్ప మానవ శరీరం

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles