•విద్యార్ధి అంటే కళాశాలకు వచ్చి వెళ్ళేవాడు కాదు. విద్యను కోరుకునే వాడు.
•విద్య అంటే పరీక్షల ముందు చదివేది కాదు. రోజూ సాధన చెయ్య వలసినది.
•చిన్న పిల్లలు టీచర్ చెపితేనే చదువుతారు. పెద్ద పిల్లలు తమంతట తామే చదువుకుంటారు.
•విద్యావంతుడి మొదటి లక్షణం – వినయం.
•ఈనాటి అవసరం పనిలో నేర్పు. అది లేనివాడు ఎందుకూ పనికిరాడు.
•సిలబస్ మొత్తం చదవని చదువు ఎందుకూ పనికి రాదు.
•విద్య అంటే ఆలోచన చేయగలగడం. మంచి, చెడు తేడా తెలుసుకోవడం.
•మనిషికి పశువుకు తేడా మాట, ఆలోచన. అవి రెండూ మంచిగా ఉంచు.
•గురువును గౌరవించని వాడికి విద్య పట్టు పడదు.
•విద్య అసలు ప్రయోజనం మంచి మనిషిగా తయారు కావడం.
•విద్యార్ధిగా కష్టపడితే తరువాత జీవితం ఆనందం. అప్పుడు ఆనందిస్తే తరువాత జీవితమంతా కష్టం.
•చదువు, ఆటలు, ఆనందాలు అన్నీ కావలసిందే. దేనికివ్వాల్సిన ప్రాధాన్యత దానికి ఇవ్వాలి.
•జీవితాన్ని మలుపు తిప్పే సమయమిది. జాగ్రత్త పడకపోతే బోల్తా పడతావు.
•డబ్బు సంపాదించడం కంటే మంచి పేరు సంపాదించడం గొప్ప.
•ఉద్యోగం సంపాదించడానికి మార్గం – నైపుణ్యం, మంచితనం.
•మంచి పౌరుడు కానివాడు చదువుకున్న అనాగరికుడు.
•జీవితపు విలువలు తెలియనివాడు అడవి మనిషి.
•పరీక్షలలో నిజాయతీ, నీతిగల జీవితానికి మొదటి అడుగు.
•జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన విలువయిన నిధి స్నేహం.
•టెక్స్ట్ చదివితే జ్ఞానం, మార్కులు వస్తాయి. నోట్స్ చదివితే మార్కులు మాత్రమే వస్తాయి.
•ప్రయోగాత్మకంగా నేర్చుకోని విద్య ప్రయోజనంలేని విద్య.
•విద్యకు అంతం లేదు. నేర్చుకోవడం ఎప్పుడూ ఆపకు.
•శ్రద్ధ, శ్రమ నిన్ను ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి. భయం, నిర్లక్ష్యం నిన్ను నాశనం చేస్తాయి.
•‘అప్పుడు సరిగ్గా చదువుకొని ఉంటే’ అని బాధపడే పరిస్థితి తెచ్చుకోకు. ఇప్పుడే సరిగ్గా చదువు.
•ఆశకు ప్రయత్నం తోడయితేనే విజయం లభిస్తుంది.
•గుర్తు పెట్టుకోవడం కంటే అర్దం చేసుకోవడం, ఆలోచించడం ముఖ్యం.
•శుభ్రత, ఆరోగ్యం, మంచివాడితో స్నేహం నీకు మంచి చేస్తాయి.
•ఆడవాళ్ళను సాటి మనుషులుగా గౌరవించు.
•పూజ చేసినంత శ్రద్ధగా చదివితే నీవు విజేత అవుతావు.
•అహంకారాన్ని తగ్గించి వినయాన్ని పెంచేదే విద్య.
Also read: “వృద్ధాప్యం”
Also read: “అక్షర ధాం, ఢిల్లీ – అపరూప కళా ఖండం”
Also read: “కాశ్మీర్”
Also read: “మహాభారతంలో శకుని”
Also read: తెలుగు మీడియం