- ఇన్ సైడర్ ట్రేడింగ్ కేసులను కొట్టివేసిన హైకోర్టు
- సంతోషం వ్యక్తంచేస్తున్న టీడీపీ, అమరావతి రైతులు
హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఇందులో టీడీపీకి చెందిన పలువురు నేతలు భారీగా లబ్ధిపొందారిన వైసీపీ సర్కారు చేస్తున్న ఆరోపణలన్నీ వాస్తవం కాదని తేలిపోయింది. అమరావతిలో రాజధాని వస్తుందని తెలుసుకుని ముందుగానే టీడీపీ నేతలు చంద్రబాబు అనుయూయులు భారీ గా వందలాది ఎకరాల భూములను కొనుగోలు చేశారని ప్రభుత్వం ఆరోపించింది. ప్రభుత్వం ఆరోపణలతో సీఐడీ నమోదు చేసిన కేసులను హైకోర్టు కొట్టివేసింది. కిలారు రాజేష్ తో పాటు మరికొంతమంది రాజధానిలో భూములు ముందుగానే కొనుగోలు చేసి భారీగా లబ్ధిపొందినట్లు ప్రభుత్వం ఆరోపించింది. ఇందులో టీడీపీ ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడించదని జగన్ సర్కార్ విమర్శలు చేసింది.
ఇది చదవండి : జనసంద్రంగా ‘అమరావతి జనభేరి’
పిటీషనర్ల వాదనతో కోర్టు ఏకీభావం
ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగినట్లు చెబుతున్న ప్రభుత్వ వాదనలపై కిలారు రాజేష్ హైకోర్టులో క్వాష్ పిటీషన్ దాఖలు చేశారు. భూములు అమ్మినవారు ఎవరూ ఫిర్యాదు చేయలేదని ప్రభుత్వం కక్ష్య పూరితంగా వ్యవహరిస్తోందని రాజేష్ పిటీషన్ లో తెలిపారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు భూములు అమ్ముకున్నవారు ఫిర్యాదు చేయకుండా కేసులు ఎలా పెడతారని సీఐడీని ప్రశ్నించారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ ఐపీసీ సెక్షన్లకు వర్తించదని వెల్లడించిన ధర్మాసనం సీఐడీ పెట్టిన కేసులన్నింటినీ కొట్టివేసింది.
కోర్టు తీర్పును స్వాగతించిన టీడీపీ
కోర్టు తీర్పుతో టీడీపీకి చెందిన సీనియర్ నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఊపిరి పీల్చుకున్నారు. పార్టీకి చెందిన నేతలను సీఐడీ ఇన్ సైడర్ ట్రేడింగ్ పేరుతో వేధింపులకు గురిచేసిందని ఇపుడు కోర్టు తీర్పుతో తామేంటో తెలిసిందని పార్టీ సీనియర్ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని తరలించడానికి ఇన్ సైడర్ ట్రేడింగే ప్రధాన కారణమన్ని భావిస్తున్న నేపథ్యంలో కోర్టు తీర్పుతో అమరావతికి భూములు ఇచ్చిన రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇది చదవండి : అమరావతిలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు