గద్దె మీద
గద్ద
అధికార ఎర వైపే చూపులు!
మొదటి సారి కరోనా
సోకి నపుడు
మిధ్యా సౌధాల వైపు పరుగులు!
Also read: నిర్వికార సాక్షి
అందరికీ వ్యాక్సిన్
అరుదైన ఆక్సిజన్
దిగ్బ్రాంతి లో సిటిజన్!
పరిశోధన ల ఫలితాలు ఏమో
వైద్యుల అవకాశ వాదం
విశాల ఆకాశం!
Also read: దేవుడా రక్షించు నా దేశాన్ని!
సంద్రం లో కొట్టుకు పోయే
వాడికి
చిన్న చెక్క దొరికి నట్లు
ఆశలు అడుగంటిన
అభాగ్య
జీవాల కి
నెర్రలు చీలిన నేల లో
పచ్చ మొలక మొలిచి నట్లు
ఆనందయ్య
ఆశా జ్యోతయ్యాడా?
మీడియా వార్త గా మిగిలి పోతాడా?
పుడమి పుత్రులను
పుడమే రక్షించుకుంటుందా?
Also read: నగరం
విశ్వాసాలన్నీ విజ్ఞానం
గీటురాయి మీద తేలాలి
జ్ఞానమే దిక్సూచి కావాలి
పాలకులు ఆ దిశ గా కదలాలి!
Also read: ఇండియా ప్రైవేట్ లిమిటెడ్
Also read: మిత్రమా ఇక యుద్ధం అనివార్యమే !
Email :[email protected]
Inspiring poem
Awesome!