అమ్మానాన్నల ఆప్యాయతలకు దూరంగా
చదువుకోసం పంపించారు నన్ను
చదివాను అన్యమనస్కంగా
ఎదురు దెబ్బలతో పుట్టిన ఆలోచనలు తప్ప
చదివి బుర్రకెక్కించుకున్నదేమీ లేకపోయింది.
నాలో ఉప్పొంగే ఆప్యాయతను వసంతంలా చల్లాను స్నేహితులపై
జీవన పయనంలో రైలు ఎక్కినవాళ్ళు మధ్యలోనే దిగిపోయారు
ప్రేమరాహిత్యంతో వేగలేని మనసు మసక బారింది
కళ్ళ పొరలు, మనసు తెరలు విచ్చే కాలం వస్తుందా
ఏమో, ఆశాదీపం ఆరిపోయేవరకు ఎదరు చూడక చేసేదేముంది
ఈ లీలా జగత్తుకు సూత్రధారి నేను కాదుగా.
Also read: దోషులు మోర విరుచుకొని తిరుగుతున్నారు!
Also read: ఈశ్వరా
Also read: లాస్ట్ అండ్ ఫౌండ్
Also read: సశేషం