——————————————————————–
(‘THE PHILOSOPHER AND THE COBBLER ‘ FROM ‘THE WANDERER’ BY KAHLIL GIBRAN)
తెలుగు అనువాదం: డా. సి. బి. చంద్ర మోహన్
22. సంచారి తత్వాలు
————————————————————-
ఒకసారి ఒక చెప్పులు కుట్టేవాని దుకాణానికి ఒక తత్త్వ వేత్త చెప్పులు ధరించి వచ్చాడు. “నా చెప్పులు బాగు చేసి పెట్టు.‘” అని దుకాణ దారుని అడిగాడు.
” నేను ఇంకొకరి చెప్పులు బాగు చేస్తున్నాను. ఇంకా వరుసలో బాగు చేయాల్సినవి చాలా ఉన్నాయి. మీ చెప్పులు అక్కడ విడిచి అక్కడ ఉన్న చెప్పులు ఈ రోజుకి తొడుక్కోండి. మీ చెప్పుల కోసం రేపు రండి. ” అని చెప్పులు కుట్టే దుకాణ దారు అన్నాడు.
తత్త్వ వేత్తకు కోపం వచ్చింది. “నావి కాని చెప్పులు నేను ధరించను. ” అన్నాడు.
అప్పుడు చెప్పులు కుట్టే దుకాణ దారు ఇట్లా అన్నాడు ” అలాగా! మీరు ఇంకొకరి చెప్పులు వేసుకోరా! మీరు నిజంగా తత్త్వ వేత్తలేనా? ఇదే వీధిలో ఇంకో చెప్పులు కుట్టే ఆయన ఉన్నాడు. ఆయన తత్త్వ వేత్తలను బాగా అర్థం చేసుకుంటాడు. మీరు అక్కడికి వెళ్లి మీ చెప్పులు బాగు చేయించుకోండి!”
Also read: కప్పలు
Also read: చట్టాలు మరియు చట్ట నిర్మాణం
Also read: మతి లేని మనిషి
Also read: చట్టాలు
Also read: విగ్రహం