Sunday, December 22, 2024

సింగేణిలో 2 లక్షల మొక్కలు నాటే భారీ సామూహిక కార్యక్రమం

  • ఫిబ్రవరి 17న కేసీఆర్ పుట్టిన రోజు
  • సంరక్షణ చర్యలు చేపట్టనున్న యాజమాన్యం

తెలంగాణాకు హరితహారం కార్యక్రమంలో భాగంగా సింగరేణి యాజమాన్యం ఈ నెల (ఫిబ్రవరి) 17వ తేదీ ఒక్కరోజునే 2 లక్షలకు పైగా మొక్కలను సింగరేణి వ్యాప్తంగా నాటాలని నిర్ణయించింది. ఈ మేరకు అన్ని ఏరియాలలో దీనికోసం సన్నాహాలు చేస్తున్నారు. ఫిబ్రవరి 17 ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు  ఎస్‌.చంద్రశేఖర్‌ (ఆపరేషన్స్‌ & పా) కొత్తగూడెం కార్పోరేట్‌ ఏరియాలో, ఎన్‌.బలరామ్‌ (ఫైనాన్స్‌& పి&పి) భూపాలపల్లి ఏరియాలో,  డి.సత్యనారాయణరావు (ఇ&ఎం) రామగుండం-1 ఏరియాలో పాల్గొనబోతున్నారు. వీరితో పాటు ఏరియా జి.ఎం.లు, కార్మికులు, అధికారులు, యువకులు ఉద్యోగులు పాల్గొనననున్నారు.

Also Read: సింగరేణిలో రాజకీయాలు

కొరోనా నిబంధనలు తప్పనిసరి:

కరోనా జాగ్రత్తలను కచ్చితంగా పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యాజమాన్యం తెలిపింది. భారీ సామూహిక మొక్కలు నాటే కార్యక్రమంలో కొత్తగూడెంలో రీజియన్‌ లోని కార్పోరేట్‌ ఏరియాలో 5 వేల మొక్కలు, మణుగూరులో 10 వేల మొక్కలు, కొత్తగూడెంలో 1 వెయ్యి మొక్కలు, ఇల్లందులో 1 వెయ్యి మొక్కలు, రామగుండం రీజియన్‌లోని రామగుండం-1లో 6,100 మొక్కలు, రామగుండం-2లో 6 వేల మొక్కలు, రామగుండం-3 & అడ్రియాలలో 10 వేల మొక్కలు, భూపాలపల్లిలో 10 వేల మొక్కలు, బెల్లంపల్లి రీజియన్‌ లోని బెల్లంపల్లి ఏరియాలో 41,200 మొక్కలు, మందమర్రిలో 1 లక్షా మొక్కలు, శ్రీరాంపూర్‌ లో 22 వేల మొక్కలు, సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో 5 వేల మొక్కలు మొత్తం అన్ని ఏరియాలలో కలిపి 2 లక్షలకు పైగా మొక్కలు నాటనున్నారు.

Also Read: సింగరేణి డిస్మిస్ కార్మికుల దీక్షలు

సంరక్షణ చర్యలు :

సింగరేణి సంస్థ 2015 నుండి తెలంగాణాలో జరుగుతున్న హరితహారం కార్యక్రమంలో భాగంగా పెద్దఎత్తున మొక్కలు నాటుతోంది. ఇప్పటి వరకూ సింగరేణి సంస్థ హరితహారం కింద 4 కోట్ల 59 లక్షల మొక్కలు నాటింది. మొక్కలు నాటడమే కాకుండా అవి ఎదిగేందుకు తగిన రక్షణ చర్యలను కూడా కంపెనీ చేపడుతోంది. పలుచోట్ల గతంలో నాటిన మొక్కలు నేడు వృక్షాలుగా ఎదుగుతున్నాయి. ఈ సారి నాటే మొక్కలను కూడా ఇదే విధంగా సంరక్షించాలని యాజమాన్యం అధికారులు, ఉద్యోగులకు విజ్ఞప్తి చేసింది.

Muneer MD
Muneer MD
Special Correspondent from Mancherial

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles