అతనో అనాథ…నాటకాలంటే ఎంత ఇష్టమో!
ఆ నాటకాలలో అతనొక్కడే నటుడు, అతనొక్కడే ప్రేక్షకుడు.
అదే నాటకం ఎన్నిసార్లు ఆడాడో, అన్నిసార్లూ చూసాడు.
అలసట లేదు, చూసింది చూస్తున్నాననే విసుగు రాదు.
వైవిద్యం కోరుకుంటాడు…అతనే రాముడు…విగ్రహవాన్ ధర్మః
‘రతి ప్రతిక్షణం మమ’ అనే నిగ్రహం లేని రావణుడు అతనే. ..
మహా పతివ్రత సీతగా…అందమైన ఆడవేషం ఆయనే వేస్తాడు!
విచ్చలవిడిగా పరపురుషుడి పొందు కోరిన
వన్నెలాడి హెలెన్ గా వ్యామోహ వ్యాసనాల వికారాలను చూపుతాడు.
బహుశా ఇది ఆత్మరతి…అందులోనే అంతులేని ఆనందం.
అందుకే అప్పుడప్పుడు పరవశంలో వశం తప్పి
యోగనిద్రలోకి జారుకుంటాడు.
అప్పుడే ఆటబొమ్మలు అసురీ విషం తాగి కరాళ నృత్యం ఆరంభిస్తాయి.
ప్రపంచాన్ని మాయ కమ్ముకొని
కర్కశ కసాయి వ్యసనాలను వ్యాపింపచేస్తుంది.
నిద్రలేచిన అనాథకు అప్పుడే తెలుస్తుంది
తన నాటకం వేరెవరో ఆడుతున్నారని…
ఇంక జాగుచేయడు…పతాక గీతం ఆలపిస్తాడు,
తెరలు దించేస్తాడు.
Also read: రూపం
Also read: గాయం
Also read: పగిలిన గాజు పెంకు
Also read: జగన్నాథ రథచక్రాలు
Also read: నేను చెప్పని కతలు
Is it Adytha thought poem is good