———– ————
(‘THE DANCER’ FROM ‘ WANDERER’ BY KAHLIL GIBRAN)
అనువాదం: డా. సి.బి. చంద్ర మోహన్
16. సంచారి తత్త్వాలు
————-
ఒకానొక రోజు ఓ నర్తకి తన సంగీత కారులతో కలిసి బిర్కాషా యువరాజు దర్బారుకు వచ్చింది. ఆమెకు రాజుసభ ప్రవేశం లభించింది. వీణ, వేణువు, సితారల సంగీతంతో ఆమె యువరాజు ముందు నృత్యం చేసింది.
ఆమె మంటల నాట్యము, కత్తులు మరియు ఈటెల నాట్యము, నక్షత్రాల మరియు అంతరిక్ష నృత్యము – మొదలైనవన్నీ చేసింది. వాటితో పాటు గాలిలో తేలియాడే పుష్పాల నృత్యం కూడా చేసింది.
తరువాత ఆమె యువరాజు సింహాసనం ముందు నిలబడి , వినయంగా వంగి అభివాదం చేసింది. యువరాజు దగ్గరకు రమ్మని సైగ చేసి, ఆమెతో ఇట్లా అన్నాడు ” ఓ రూపవతీ!, ఆనంద, లావణ్యాల తనయా! ఎక్కడ నేర్చావు ఈ కళను!? నీ లయ, పాటలలో అన్ని అంశాలపైనా ఎలా సాధికారం సంపాదించావు?”
నర్తకి మరలా రాజుకు వంగి నమస్కరించి ఇలా అంది. ” పరాక్రమశాలీ !, దయగల ప్రభూ! మీ ప్రశ్నలకు నాకు సమాధానం తెలీదు. నాకు తెలిసిన దల్లా – ఒక వేదాంతి ఆత్మ అతని శిరస్సులో ఉంటుంది. కవి ఆత్మ హృదయంలో ఉంటుంది. గాయకుని ఆత్మ అతని స్వరంలో ఉంటుంది. కాని ఒక నర్తకి ఆత్మ ఆమె తనువంతా వ్యాపించి ఉంటుంది.”
Also read: శాంతి – యుద్ధము
Also read: “నేతి”
Also read: వేదన
Also read: మూడు కానుకలు
Also read: సౌందర్యం