(డా. ఆవంత్స సోమసుందర్ శతజయంతి)
నవంబర్ 19, ఆదివారం కాకినాడ జిల్లా పిఠాపురంలోని శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో చెలికాని భావనరావు సభాసదన్ లో జరిగిన వజ్రాయుధ మహాకవి, శతాధిక గ్రంథకర్త, కళారత్న డా. ఆవంత్స సోమసుందర్ గారి శతజయంత్యుత్సవ సదస్సు కన్నుల పండుగగా జరిగింది. సుమారు 120 మందికి పైబడి పాల్గొన్న ఈ సమావేశంలో దాదాపు 50 మంది సో.సు. గారితో గాఢమైనవారి అను బంధం గూర్చి పంచుకున్నారు!
ఢిల్లీ మొదలుకొని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, రాజమహేం ద్రవరం, కోరుకొండ, పెద్దాపురం, సామర్లకోట, కాకినాడ …ఇంకా అనేక ప్రాంతాల నుండి కార్యక్రమం కోసం పనిగట్టుకు వచ్చిన మిత్రులకూ, మొత్తం సదస్సు పూర్త య్యేవరకూ ఉండి వారి భావాలు పంచుకుని శతజయంత్యుత్సవ ఆతిథ్యం, చిరు సత్కారాలు, స్వీకరించి ఆనందంగా వెళ్ళిన శ్రేయోభిలాషులు అందరకీ పేరుపేరునా ధన్యవాదాలు!
ఎంత గొప్ప కార్యక్రమంలో ఐనా పొరపాట్లు, కొన్ని లోటు పాట్లు సహజం. అలా సభికుల్ని వారి పాటలతో అలరించిన పెద్దాపురం ప్రజా నాట్యమండలి బృందానికీ చిరు సత్కరం జరగకపోవడం, కొద్దిమంది మిత్రులకి మాట్లాడే అవకాశం లభించకపోవడం మా తప్పే. ఉద్దేశ పూర్వకంగా చేయకపోయినప్పటికీ సదస్సు
సంచాలకుడిగా జరిగిన దానికి పూర్తి బాధ్యత నాదేనని అందుకు క్షంతవ్యుడ్నని మనవి చేస్తూ వారికి ప్రత్యేక అభినందనలు !
శతజయంతి సందర్భంగా ప్రచురించిన పుస్తకం ‘ఆకాశమంత అక్షరమూర్తి – డా. ఆవంత్స సోమసుందర్ ( వజ్రాయుధ కవికి వందేళ్ళు)’ అనే 40 పుటల చిన్న పొత్తం. కంటి ఆపరేషన్ కోసం ముంబయి నుంచి హైదరాబాద్ వచ్చిన కామ్రేడ్ వరవరరావు గారు నాలుగుపుటల్లో ఈ పుస్తకానికి ముందుమాటగా ఆత్మీయ సందేశాన్ని ‘ఆవంత్స సోమసుందర్ – ఆనాటి జ్ఞాపకాలు’ పేరిట డిక్టేట్ చేసి పంపించడం విశిష్టమైన విషయం!
అపూర్వమైన శతజయంతి కార్యక్రమం గురించిన మధుర జ్ఞాపకాలను తీరిక చేసుకుని పూర్తిగా తర్వాత పంచుకుంటానుగానీ, ఎక్కడెక్కడ నుండో సమావేశం కోసమని శ్రమకోర్చి స్వచ్ఛందంగా వచ్చి పాల్గొన్న సాహితీ వేత్తలు, సామాజిక కార్యకర్త లు, సారస్వత పిపాసులకి పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు. ఆసక్తి ఉన్న మిత్రులకి సాఫ్ట్ కాపీ పంపుతున్నాను. విమర్శలకు ఆహ్వానం !
– గౌరవ్