Thursday, November 21, 2024

హైదరాబాద్ లో మైనర్ బాలికపైన సామూహిక అత్యాచారం

  • ఐదుగురు నిందితులలో ముగ్గురు మైనర్లు
  • ఒక నిందితుని అరెస్టు, ఒక మైనర్ టీఆర్ఎస్ ఎంఎల్ఏ కుమారుడు
  • అందరినీ వెంటనే అరెస్టు చేయాలని బీజేపీ నాయకుల డిమాండ్
Mercedes car
పేస్ట్రీ షాప్ దగ్గర నిలిచి ఉన్న మెర్సిడిస్ కారు

తెలంగాణ రాజదాని హైదరాబాద్ లో 17 ఏళ్ళ మైనర్ బాలికపైన సంపన్న రాజకీయ నాయకుల పిల్లలు సామూహిక అత్యాచారం చేశారు. అత్యాచారం చేసినవారిలో సాదుద్దీన్ మాలిక్, ఒమర్ ఖాన్ అనే ఇద్దరు అనుమానితులను పోలీసులు గుర్తించారు. మిగిలిన ముగ్గురు మైనర్లు. అందువల్ల వారి పేర్లు వెల్లడించలేదు. మే 28 శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న ఎర్ర మెర్సిడిస్ కారులో అయిదుగురు యువకులూ మైనర్ బాలికపైన అత్యాచారం చేశారని మొదట సమాచారం వచ్చింది. మెర్సిడిస్ ఎంఎల్ఏ కొడుకుదనీ, అత్యాచారం జరిగింది ఇన్నొవాలోనని  పోలీసులు చెబుతున్నారు. మెర్సిడిస్ పేస్ట్రీ షాపు దగ్గర నిలబడి ఉంది. అమ్మాయి, అయిదుగురు యువకులూ ఇన్నొవాలో ఎక్కారని పోలీసులు చెప్పారు.

పోలీసులు సాదుద్దీన్ మాలిక్ ను శుక్రవారంనాడు అరెస్టు చేశారు. వక్ఫ్ బోర్డు నాయకుడి కొడుకు, ఒక మంత్రి మనుమడు ఈ అత్యాచారంలో పాల్గొన్నారంటూ బీజేపీ నాయకులు ఆరోపించారు. అయితే, హోంమంత్రి మనుమడు ఈ వ్యవహారంలో పాల్గొనలేదని పోలీసులు స్పష్టం చేశారు. ‘‘ఈ కేసులో అయిదుగురు నిందితులనూ గుర్తించాం. వారిలో ముగ్గురు మైనర్లు. ఒక నిందితుడు సాదుద్దీన్ మాలిక్ ను అరెస్టు చేశాం. హోంమంత్రి మనుమడు ఇందులో ఉన్నాడనే ఆరోపణ నిరాధారమైంది,’’ అని డీసీపీ జోయెల్ డేవిస్ చెప్పారు.

‘ఒక టీఆర్ఎస్ నాయకుడూ, వక్ఫ్ బోర్డు అధ్యక్షుడి కుమారుడు ఇందులో పాల్గొన్నాడు. అయితే అతడు మైనరు. ఏఐఎంఐఎంకు చెందిన శాసనసభ్యుడి కుమారుడు ఉన్నట్టు మాకు సాక్ష్యాధారాలు ఏమీ లభించలేదు. మరిన్ని సాక్ష్యాధారాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నాం,’ అని పోలీసులు వివరించారు. నిందితులలో ముగ్గురు పదకొండు, పన్నెండవ తరగతి చదువుతున్న మైనర్లు.

మే 28న 17 ఏళ్ళ బాలిక పబ్ కు వెళ్ళింది. అక్కడ ఒక పిల్లవాడితో స్నేహం చేసింది. అతడితోనూ, అతడి స్నేహితులతోనూ  కలిసి పబ్ నుంచి బయటకు వెళ్ళింది. వారు ఆమెను ఇంటి దగ్గర దిగపెడతామని చెప్పి ఉండవచ్చు. జూబిలీ హిల్స్ లో పార్క్ చేసిన కారులో ఆ మైనర్ బాలికపైన అయిదుగురు అత్యాచారం చేశారు. తిరిగి ఆమెను పబ్ దగ్గర దింపి వెళ్ళిపోయారు. ఆ బాలిక తండ్రికి ఫోన్ చేసింది. తండ్రి వచ్చి ఇంటికి తీసుకొని వెళ్ళారు. వెడుతుండగా మెడమీద గాయాలు ఏమిటని అడిగారు. కొంతమంది యువకులు తనపైన దాడి చేశారని ముక్తసరిగా చెప్పి ఆమె ఊరుకున్నది. కానీ ఆమె లోలోపల దుఃఖిస్తూ కుమిలిపోతూ కనిపించింది. తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికపైన దాడి అని కేసు రిజిస్టర్ చేశారు పోలీసులు. తర్వాత ఆమెను ఆడపోలీసులు ప్రశ్నించినప్పుడు జరిగినదంతా పూసగుచ్చినట్టు చెప్పింది. ఆమెను ఆస్పత్రికి పంపించి వైద్యపరీక్ష చేయించారు. తర్వాతనే పోలీసులు కేసును సామూహిక అత్యాచారం కేసుగా మార్చారు.  

ఒక ఎంఎల్ఏ కుమారుడు పబ్ లో ఉన్నాడనీ, ఆ బాలిక వెంట కారు ఎక్కినవారిలో కూడా అతడు ఉన్నాడనీ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. బాలిక మాత్రం ఒక కుర్రాడి పేరు మాత్రమే చెప్పింది. తక్కిన పేర్లు ఆమెకు తెలియవు. పోలీసులు నెమ్మదిగా దర్యాప్తు చేస్తున్నారని తెలంగాణ బీజేపీ నాయకులు ఆరోపించారు. అయిదుగురు నిందితులనూ తక్షణం అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. అయితే, తమ అబ్బాయి కారు దిగి కెఫేలో కూర్చున్నాడనీ, అత్యాచారంతో అతడికి సంబంధం లేదని ఎంఎల్ఏ కుటుంబ సభ్యులు అంటున్నారు. టీఆర్ఎస్ ఎంఎల్ఏ మైనర్ కుమారుడిని శనివారంనాడు అరెస్టు చేయాలని పోలీసులు నిర్ణయించుకున్నారు.

ఈ ఘటన పట్ల తెలంగాణ ఐటీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) దిగ్భ్రాంతిని వెలిబుచ్చారు. నిందితులు ఎవరైనా, ఎంత పెద్దవారి పిల్లలైనా సరే ఉపేక్షించవద్దనీ, కఠిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రికీ, డీజీపీకి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఆయన చెల్లెలు, ఎంఎల్ సి కవిత కూడా ఆగ్రహం, ఆవేదన వెలిబుచ్చారు. ఇటువంటి ఘటన హైదరాబాద్ లో జరగడం సిగ్గుపడవలసిన, దురదృష్టకరమైన  అంశమనీ, మహిళల భద్రత విషయంలో మనం ఏ మాత్రం ఉపేక్షించబోమనే మంచి పేరు ఉన్నదనీ, దాన్ని నిలబెట్టుకోవాలనీ ఒక ట్వీట్ లో కవిత వ్యాఖ్యానించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles