- బొగ్గుకి పెరుగుతున్న డిమాండ్
- 700 లక్షల టన్నుల లక్ష్యం సాధించాల్సిందే-సి&ఎం.డి ఎన్.శ్రీధర్
- అన్ని ఏరియాల జి.ఎం.లతో సమీక్షా సమావేశం
ఈ ఆర్ధిక సంవత్సరంలో చివరి నెల అయిన మార్చిలోనూ, ఆ తర్వాత నెల ఏప్రిల్ లోనూ రోజుకి 2 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాలని అదే సమయంలో బొగ్గు నాణ్యత ప్రమాణాలను పాటించడంపైన, భద్రతపైన ప్రత్యేక దృష్టి సారించాలని సింగరేణి సంస్థ సి&ఎం.డి. ఎన్.శ్రీధర్ అన్ని ఏరియాల జి.ఎం.లను ఆదేశించారు. హైదరాబాద్ సింగరేణి భవన్ నుండి బుధవారం (మార్చి3వ తేదీ) నాడు ఆయన వీడియో కాన్ఫరెన్సు ద్వారా కొత్తగూడెంలోని డైరెక్టర్లు, అన్ని ఏరియాల్లోని జి.ఎం.లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
బొగ్గు ఉత్పత్తిలో నాణ్యత ప్రమాణాల పెంపుదలకు గట్టి చర్యలు తీసుకోవాలనీ, అలాగే రక్షణపై కూడా ఎటువంటి రాజీలేకుండా, ఖర్చుకు వెనుకాడకుండా చర్యలు చేపట్టాలని కోరారు. వర్షాకాలంలో ఉత్పత్తికి ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి ఇప్పటినుండే ప్రణాళికలు అమలు చేయాలన్నారు. కోవిడ్ వలన కోల్పోయిన నష్టాలను భర్తీ చేసుకొంటూ, వచ్చే ఆర్ధిక సంవత్సరంలో 700 లక్షల టన్నుల రికార్డు స్థాయి ఉత్పత్తి సాధనకు అన్ని ఏరియాలు సంసిద్ధంకావాలన్నారు.
ఇదీ చదవండి: సింగరేణిలో రాజకీయాలు
‘‘కోవిడ్ తర్వాత పరిశ్రమలన్ని తిరిగి కోలుకొంటున్నాయి. కనుక సింగరేణి బొగ్గుకు డిమాండ్ పెరుగుతోంది. వచ్చే ఏడాది మూతపడే గను ఏమీలేవు, కొత్తగా ప్రారంభమయ్యే గనుల నుండి క్రమంగా బొగ్గు ఉత్పత్తి పెరుగుతుంది. కనుక వచ్చే ఏడాది కనీసం 700 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి, రవాణాకు పరిస్థితులు పూర్తి సానుకూలంగా ఉన్నాయి. కాబట్టి ప్రతీ ఏరియా నిర్దేశిత లక్ష్యాలు సాధించడానికి ఏప్రియల్ నెలనుండే సంసిద్ధంగా ఉండాలి’’ అని ఎన్.శ్రీధర్ జీఎంలను ఆదేశించారు. ప్రతీ జి.ఎం. మంచి నాయకత్వ ధోరణితో అందరినీ ముందుకునడిపించాలని, కంపెనీకి మేలు చేసే ఏ ప్రతిపాదనికైనా తాను తప్పక అంగీకరిస్తానని, కనుక లక్ష్యాల సాధనకు, సమస్యల పరిష్కారానికి వినూత్నమైన ప్రతిపాదనలతో ముందుకు రావాలని ఆయన జి.ఎం.లను కోరారు.
సమీక్షా సమావేశంలో కొత్తగూడెం హెడ్ ఆఫీసు నుంచి సంస్థ డైరెక్టర్ (ఆపరేషన్స్ & పా) ఎస్.చంద్రశేఖర్, డైరెక్టర్ (ఫైనాన్స్ & పి&పి) ఎన్.బలరామ్, డి.సత్యనారాయణ రావు డైరెక్టర్ (ఇ&ఎం) లు పాల్గొనగా, హైదరాబాద్ కార్యాలయంలో ఇ.డి. కోల్ మూమెంట్ జె.ఆల్విన్, అడ్వయిజర్ (మైనింగ్) డి.ఎన్.ప్రసాద్, అడ్వయిజర్ (ఫారెస్ట్రీ) కె.సురేంద్రపాండే, జి.ఎం. (కో-ఆర్డినేషన్) కె.రవిశంకర్, జి.ఎం. మార్కెటింగ్ కె.సూర్యనారాయణ అన్ని ఏరియాల నుండి ఏరియా జి.ఎం.లు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:సీఎంకు సింగరేణి ప్రగతి నివేదిక