- “కమ్యూనికేషన్ స్కిల్స్” నేటి ప్రపంచంలో మేటి ఉద్యోగార్హత!
ఇదీ పోటీ ప్రపంచం….ఉద్యోగాలు సంపాదించాలంటే ఇస్త్రీ షర్టూ, పాంట్ కోటు వేసుకొని, టక్కు చేసుకొని, టై కట్టుకొని వెడితే ఉద్యోగం వచ్చే రోజులు ఏనాడో పోయాయి! చదివింది ఏ సబ్జెక్టో అనవసరం. అనర్గళమైన ఇంగ్లీష్ ఉచ్చారణ, తెలుగులో సుమధుర భాషణ ఉందా అని చూసే కంపెనీ సిఇవోలు ఉద్యోగం కోసం వచ్చే నిరుద్యోగులకు పరీక్ష పెడుతున్నారు. వాళ్ళు నడిచే తీరు, మాటల , కమాండిగ్ నేచర్, వస్త్ర ధారణ కన్నా ఎక్కువ పరిశీలిస్తున్నారు. టీవీ రంగం, సినిమా రంగం ఒక్కటేమిటీ ప్రతి కంపెనీ చురుకైన యువత కోసం ఎదురు చూస్తోంది. అలాగే సందర్భాన్ని బట్టి సమస్యను బట్టి వాళ్ళు తీసుకునే నిర్ణయాన్ని తెలుసుకొని ప్రమోషన్లు ఇస్తుంటారు.
సుమ, గ్రేట్ కమ్యూనికేటర్
ఇప్పుడు కాదు, గత ఇరవై ఏళ్ళ టీవీ రంగాన్ని ఏలుతున్న సుమ నాన్ స్టాప్ గా మాట్లాడి ప్రేక్షకులకు ప్రోగ్రాం ను రేటింగ్ పెంచుతున్న నేటి అమ్మాయిలకు ఒక గైడ్! ఇక సుమ బాషణ ఆమె సొంతం. అనర్గళమైన విషయ పరిజ్ఞానం, మనసు దోచే మధురమైన సంభాషణ వల్ల ఆమె టీవీ రంగంలో మకుటం లేని మహారాణి. టీవీ షో లతో విరామం ఎరగకుండా పని చేస్తున్న ఆమె వాక్చాతుర్యం అద్భుతం. ఇవ్వాళ ప్రతి ఇంట్లో సుమ మాటలు మారు మ్రోగుతూనే ఉంటాయి. ఆ మాటలే ఆమెను కమ్యూనికేషన్ స్కిల్ లో ఐకాన్ గా నిలిపాయి. ఈ పోటీ ప్రపంచంలో మజ్జుగా ఉంటే మరుగున పడిపోతారు. మధురమైన సంభాషణ, ఆకట్టుకునే స్వభావం ఉంటే చాలు ఉద్యోగం మీ ఇంటి ముందుకు వస్తుంది. నలుగురిని ఒప్పించి మెప్పించగలిగితే టీమ్ లీడర్ గా అన్నీ దేశాలు చుట్టి వచ్చే అవకాశం మీకు మీ బాస్ లు కట్టబెడతారు. అలాంటి అద్భుత అవకాశం ఒక మీ నోటికే ఉంది. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఒక వ్యక్తి జీవితంలో ముఖ్యమైన భాగం. భగవంతుడు మానవునికి భాషను బహుమతిగా ఇచ్చాడు. ఒక వ్యక్తికి సమర్థంగా కమ్యూనికేట్ చేసే నైపుణ్యం ఉంటే అతను తన వృత్తిలో విజయం సాధించినట్టే. కమ్యూనికేషన్‌లో రెండు రకాలు ఉన్నాయి. ఇది శబ్ద లేదా అశాబ్దిక వ్యవహారంగా ఉంటుంది. ఈ రోజు పోటీ ప్రపంచంలో ప్రతి కంపెనీ మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాన్ని కోరుతుంది. ఒక విద్యార్థి లో మాట్లాడే నైపుణ్యాన్ని మాత్రమే చూసే రోజులు వచ్చాయి. మాట తీరే అసలైన విద్యార్హత.
Also Read: అధికారం… అహంకారం
కమ్యూనికేషన్ లో భాష ప్రధానం
కమ్యూనికేషన్ నైపుణ్యం అభివృద్ధిలో, ప్రతి వ్యక్తికి భాష ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. తన కమ్యూనికేషన్ నైపుణ్యాన్ని ప్రదర్శించి ఎదుటి వ్యక్తిని ఒప్పించగలిగితే చాలు ఉన్నత ఉద్యోగం ఖాయం అయినట్టే. భూ ప్రపంచంలో ఇతర జీవుల నుండి మానవుడు భిన్నంగా ఉండడానికి కారణం “మాట”. తన ఆలోచనలను మాటలతో వ్యక్తీకరించడానికి దేవుడి ద్వారా మనిషి బహుమతి పొందాడు. భూమిపై మాట్లాడగల ఏకైక జీవి మనిషి. ప్రస్తుతానికి ఇంగ్లీష్ ప్రపంచంలో అత్యంత విలువైన భాష. ఇది ప్రపంచమంతా మాట్లాడుతుంది. కానీ భారతదేశంలో ఉన్నత అధ్యయనాలలో విద్యార్థులు కమ్యూనికేషన్‌లో వివిధ రకాల సమస్యలను ఎదుర్కొంటున్న మాట వాస్తవం! మన పాఠశాలల్లో ఇంగ్లీష్ బోధన సరిగా లేదు! గ్రాడ్యుయేషన్ తరువాత కూడా చాలా మంది విద్యార్థులు ఇంగ్లీష్ భాషను సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు… మాట్లాడలేక పోతున్నారు. వ్రాయలేక పోతున్నారు. అయినప్పటికీ అంతో ఇంతో ఇంగ్లీష్ నేర్చుకున్నారు. భారతీయ పాఠశాలలూ, కళాశాలలలో సంబంధిత విషయాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే, ఇంగ్లీష్ లో “స్టైలిష్ కంటెంట్” ఉపాధ్యాయులు ఇవ్వలేక పోతున్నారా, లేక ఇంట్లో మాతృభాష మాట్లాడడం వల్ల ఇంగ్లీష్ భాష పై పట్టు సాధించలేక పోతున్నారా అర్థం కావడం లేదు. పిల్లలు అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడలేక పోవడానికి కారణం వారి ఆత్మ నూన్యతా భావం! మాతృభాష పై ఎంత మమకారం ఉన్నా ఇతర భాషలు ముఖ్యంగా ఇంగ్లీష్ భాష కూడా నేటి యువతకు ఉపాధి చూపిస్తుంది. ఆ సత్యాన్ని ఒప్పుకోవడంలో తప్పు లేదు. అలా అని మాతృభాషను నిర్లక్ష్యం చేయకూడదు.
తెలుగువారి ఇంగ్లీష్ బోధన 1980ల వరకూ ఒక సవాల్
తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఎనభై దశకం వరకు ఇంగ్లీష్ బోధన ఒక సవాలుగా ఉండేది. నైజాం ప్రభుత్వం తెలంగాణ ఏలింది కాబట్టి ఉర్దూ, హిందీ మాధ్యమాల ప్రభావం ప్రతి ఇంట్లో పడింది. 1985 కు ముందు అమెరికా వెళ్లేవారిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సర్కారు జిల్లాల వారు ఎక్కువ ఉండేవారు. 1961 కి ముందు సర్కారు జిల్లాల్లో ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు ఎక్కువగా ఉండేవి. బ్రిటిష్ వారు విడిచి వెళ్లిన కోస్తా జిల్లాల్లో ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు ఎక్కువగా స్థాపించారు.
అమెరికా భారత దేశంలోని టాలెంటెను తమ కంపనీ లో నింపడం 1980లలో ప్రారంభించడంతో తెలంగాణ జిల్లాలలోని తల్లిదండ్రులు తమ పిల్లలను శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలో చేర్చేవారు! కారణం ఇంగ్లీష్ భాషా ప్రావీణ్యం తమ పిల్లలకు ఎక్కువగా ఉండాలి అనే ఆలోచన అప్పటి పేరెంట్స్ కు రావడం. హైద్రాబాద్ లో 1980లో రామకృష్ణ మఠం వారు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు నిర్వహించే వారు. ప్రొఫెసర్ శివరామకృష్ణ నిర్వహించేవారు. అప్పటి జర్నలిస్ట్ లు, రాజకీయ నాయకులు ఆ సంస్థలో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి తంటాలు పడేవారు! అయితే, అప్పుడు ఇప్పటిలాగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఒక పట్టాన అర్థం అయ్యేవి కాదు. తెలంగాణలో చాలా మంది విద్యార్థులు గ్రామాలకు చెందినవారు కాబట్టి వారి ప్రాంతీయ భాష లేదా మాతృభాష యొక్క ప్రభావం వారి కమ్యూనికేషన్ నైపుణ్యంపై స్పష్టంగా కనబడేది.
Also Read: బంధువులు… బహుముఖాలు!
ఆంగ్లంపై మాతృభాష ప్రభావం
విద్యార్థులు మాత్రమే కాదు, ఉపాధ్యాయులపై కూడా మాతృభాష ప్రభావం అధికంగా ఉండేది. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇద్దరూ తమ మాతృభాషలో ఉన్నత తరగతులలో కూడా మాతృభాషలోనే సంభాషించే వారు. ఇలా మాట్లాడటం అలవాటు చేసుకున్నప్పుడు. మాట్లాడేటప్పుడు వారు వాక్యం మధ్యలో కొన్ని ఆంగ్ల పదాలను మాత్రమే ఉచ్ఛరించేవారు. ఇంగ్లీష్ బాష అంటే ఒక బ్రహ్మపదార్థంగా ఉండేది. ఇప్పుడు ప్రపంచం పిడికిల్లోకి వచ్చాకా యు ట్యూబ్ లో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటి యువత కూడా మారిన ప్రపంచంలో సరికొత్త సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ప్రాంతాలకు అతీతంగా పుట్టిన బిడ్డ నుంచి మమ్మీ డాడీ సంస్కృతిలో మాట్లాడే ఇరవై తెలుగు పదాల్లో పది ఇంగ్లీష్ పదాలు జోడిస్తున్నారు. నీళ్లు అనే పదం మరిచిపోయి “వాటర్” అనే పదం నిత్యకృత్యం అయింది. ఇలా జీవిత గమనంపైన ఆంగ్ల భాష ప్రభావం విపరీతంగా పడింది. ఇక ఇప్పటి యువత సరికొత్త సమస్య ఎదుర్కొంటున్నారు…అదేమిటంటే … ఆంగ్లంలో తేడా. ప్రపంచంలో ఇంగ్లీష్ రెండు రకాలు. ఒకటి యు.కె ఇంగ్లీష్, రెండోది యు.ఎస్. ఇంగ్లీష్. రెండింటిలో ఉచ్చారణలో తేడా ఉంది. స్పెల్లింగ్ లో వ్యత్యాసం ఉంది. భారతదేశంలో యు.కె ఇంగ్లీష్ ఆచరణలో ఉంది. కానీ ఇప్పుడు కంప్యూటర్ యుగంలో యు.ఎస్. ఇంగ్లీష్ ఉపయోగించబడుతుంది. కాబట్టి విద్యార్థులు గందరగోళం చెందుతున్నారు.
బోధనలో లోపాలు
అనువాద విధానంలో తెలుగు రాష్ట్రాల్లో చాలా పాఠశాలల్లో అనువాద పద్ధతి తరగతి ప్రారంభం నుండి ఉపయోగిస్తున్నారు. ఈ పద్ధతి ద్వారా విద్యార్థులు టెక్స్ట్ యొక్క కంటెంట్‌ను మాత్రమే అర్థం చేసుకుంటారు. కాని దానికి మించి ఏమీ నేర్చుకోలేక పోతున్నారు. వారు ఈ పద్దతిని ప్రారంభించకుండా అలవాటు చేసుకుంటారు కాని ఉన్నత స్థాయిలో ఈ పద్ధతి ఉపయోగించరు. కాబట్టి వారు ఉన్నత అధ్యయనాలలో సమస్యలను ఎదుర్కొంటున్నారు.
చాలా మంది విద్యార్థులు అజ్ఞానం కారణంగా పొరపాట్లు చేస్తున్నారు. బోధనలో వారికి చెప్పలేదు కనుక వారు లోపాలను గ్రహించకుండానే వాటిని పునరావృతం చేయడం వల్ల కంపెనీ నియామకాల్లో పూర్ ఇంగ్లీష్ అనే మాట సిఇఓ నుంచి విద్యార్థులు ఎదుర్కొంటున్నారు. ఇక మారిన ప్రపంచంలో అమ్మాయిలు అబ్బాయిలు నేర్చుకుంటున్నది స్పీడ్ ఇంగ్లీష్…యూకే ఇంగ్లీష్, యుఎస్ ఇంగ్లీష్ బట్టీపట్టి సమయానుకూలంగా మాట్లాడుతున్నారు. కానీ లెఫ్ట్- రైట్ డ్రైవింగ్ లాగా ఇంకా తత్తరపాటు పోలేదు.
Also Read: ఆనందం ఆరోగ్యానికి దివ్య ఔషధం
ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ప్రధానం
ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అనేది ఈ నాటి తరానికి ముఖ్యం అయింది. ఇది ఉన్నత అధ్యయనాలలో విజయానికి నిచ్చెన లాంటిది.. ఇంగ్లీష్ భాష చాలా దేశాలలో కమ్యూనికేషన్ స్కిల్స్ గా మారింది. కమ్యూనికేషన్ సహాయంతో విద్యార్థులు ఏ దేశ విద్యార్థులు తమకు కొలీగ్స్ అయినా వారితో కలిసిపోయే ఉచ్ఛారణ కమ్యూనికేషన్ స్కిల్స్ కు దోహదం చేస్తుంది. దీని వల్ల అందరితో అర్థం అయ్యే సంబంధాలు పెట్టుకుంటారు. వారు తమ ఆలోచనలను కూడా పంచుకోవచ్చు. కానీ భారతదేశం వంటి చాలా దేశాలలో, విద్యార్థులకు ఆంగ్ల భాషపై మంచి పట్టు లేదు కాబట్టి వారు ఉన్నత చదువులపై సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయలేక పోతున్నారు. ఫలితంగా వారు ఇతర దేశాల విద్యార్థులతో పోటీ ప్రపంచంలో వెనుక బడి పోతున్నారు. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే, భారతదేశంలో చాలా పాఠశాలల్లో, హిందీ లేదా ఇతర మాతృభాషల మాధ్యమంగా ఉపయోగించబడుతుంది. పాఠశాల స్థాయిలో ఇంగ్లీషును రెండవ భాషగా బోధించగా, ఉన్నత విద్యాసంస్థలలో చాలా వరకు దీనిని ఉపయోగిస్తున్నారు బోధనా భాషగా.
ఆంగ్ల పరిజ్ఞానం ఆత్మవిశ్వాసం పెంచుతుంది
ఆంగ్లంలో మంచి పరిజ్ఞానం వ్యక్తిని బలంగా, నమ్మకంగా జీవితంలో ప్రయాణం చేస్తుంది. ఇది ఒక వ్యక్తి కమ్యూనికేషన్ నైపుణ్యాన్ని సమర్థవంతంగా పెంపొందిస్తుంది. అతనిలో విశ్వాసాన్ని నింపుతుంది. మంచి కమ్యూనికేషన్ నైపుణ్యం ఉన్న ఆత్మవిశ్వాసంతో ఉన్న వ్యక్తికి తన దేశంతో పాటు విదేశీ దేశంలో కూడా ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటాయి. వివిధ రకాలైన కోర్సులలో ఉన్నత సంస్థలలో ఇంగ్లీషు బోధనా మాధ్యమంగా ఉపయోగించబడుతుంది. విద్యార్థులు ఈ స్థాయిలో ఇంగ్లీష్ చదువుతారు, ఎందుకంటే ఇది విద్యార్థులకు కమ్యూనికేషన్‌లో సహాయపడుతుంది. ఆంగ్లంలో మంచి కమ్యూనికేషన్ విద్యార్థులు తమ లక్ష్యాన్ని సాధించడానికీ, విజయం సాధించడానికీ సహాయపడుతుంది. ఈ-పేపర్ ఉన్నత అధ్యయనాలలో కమ్యూనికేషన్‌లో విద్యార్థుల సమస్యలను తెలుసుకునే ప్రయత్నం. ఇది వారి కమ్యూనికేషన్ నైపుణ్యాన్ని మెరుగుపరచడంలో విద్యార్థులకు సహాయపడటానికి కొన్ని చర్యలను సూచిస్తున్నది.
Also Read: వివాహ వ్యవస్ధ పయనం ఎటు?