- వెల్లు వెత్తిన అభిమానానికి చెమర్చిన కళ్లు
- నా కోసం మోస పోయిన మిత్రుడు నిరంజన్ దేశాయ్
- నేను బెంగుళూరు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నట్టు నా ఫెస్ బుక్ లో పేక్ న్యూస్.
- రాత్రి మా కుటుంబం ఆందోళన
రాత్రి నిద్రకు ఉపక్రమిస్తున్న వేళ 10.30 కు నా మిత్రుడు అష్టకాల కిరణ్ సాగర్ ‘మీ ఫేస్ బుక్ అకౌంట్ హాక్ అయింది. మీరు క్షేమమే కదా డబ్బుల కోసం ఒక సైబర్ దొంగ మీరు తీవ్ర అస్వస్థతో ఆసుపత్రిలో ఉన్నట్టు మెసేజ్ లు పెడుతున్నారు” అన్నాడు. నా నిద్ర చెదిరిపోయింది. వెంటనే మా పిల్లలను ఎలర్ట్ చేశాను. అచ్చం నా లాగే మెస్సెంజర్ ను, ఫేస్ బుక్ ను వాడుకుంటూ నా మిత్రులకు మెసేజ్ పెట్టడం మొదలయింది.
ఇక వాడి మీద నిఘా పెట్టి పోలీసులకి కంప్లయింట్ ఇవ్వడానికి సిద్దమవుతున్న దశలో అన్ని ఫెస్ బుక్ అకౌంట్లు, బ్యాంక్ అకౌంట్లు అన్ని చెక్ చేసుకుంటూ ఉన్నంతలో రాత్రి 11.30 అయింది. ఈ లోపు రాష్ట్రంలో ఉన్న నా అభిమాన మిత్రులు, మహబూబ్ నగర్ నుండి సీనియర్ అడ్వకేట్ వెలదండ నరసింహారావు ఆదిలాబాద్ సూర్యప్రకాష్ రావు ఇలా రాత్రి 12.30 వరకు నన్ను ఎలర్ట్ చేశారు. వరంగల్ వేణు గోపాల రావు పెద్ద మొత్తం లో డబ్బు తయారు చేసుకుని బెంగుళూరు బయలు దేరుతున్నట్టు ఫోన్ చేశారు. ఆ ఫోన్ నేనే ఎత్తి “నేను క్షేమంగా ఉన్నానని, చెప్పాను.
Also Read: సోషల్ మీడియా సామాజిక విప్లవమా?సమస్యల సమాహారమా?
ఆ దొంగను పట్టుకోవడానికి తద్వారా వాడి నెంబర్ ను ట్రాప్ చేయడానికి మా పిల్లలు తమ కంప్యూటర్ తెలివి తేటలతో చాట్ చేసే ప్రయత్నం చేశారు. వాడు వరంగల్, గజ్వెల్ నుండి నేనే అన్నట్టు నా మిత్రులను మెసేజ్ లు పెడుతూనే ఉన్నాడు! ఈ లోపే నా మిత్రుడు నిరంజన్ దేశాయ్ నాతో చాట్ చేస్తున్నట్టు దొంగ తో చాట్ చేశాడు. గూగుల్ పే లో ముందు ఒక్క రూపాయి వేశాడు. తరువాత పది వేలు పంపాడు. బెంగుళూరు ఆసుపత్రిలో మృత్యువు పోరాడుతున్నానని ఫెస్ బుక్ మెసెంజర్ హాక్ చేసినట్టు మా పిల్లలు గుర్తించారు. దేశాయ్ “డబ్బులు నా మిత్రుడు అకౌంట్లో వేసినట్టు క్షేమంగా ఉన్నారా? అని గద్గద స్వరంతో అనగానే ‘నేను క్షేమంగా ఉన్నాననీ, నేను బెంగుళూర్ లో లేనని, ఇంట్లో (ప్రజ్ఞాపూర్) లో ఉన్నాననీ, నాకు ఏ అస్వస్థత గా లేదనీ, అసలు నేను చాలా ఆరోగ్యం గా ఉన్నానని” చెబుతూనే ఉన్నాను. కొండూరు శ్రీధర్ హైదరాబాద్ నుండి, దిలీప్ సికింద్రాబాద్ నుండి దొంగను పోలీసులకి ట్రాప్ చేస్తున్నట్టు దొంగకి వార్నింగ్ ఇచ్చారు.
ఈ సైబర్ నేరగాడు ఉత్తర ప్రదేశ్ గ్యాంగా లేక నాకు తెలిసిన వాళ్ళ పనా, నా ఫోన్ పాస్ వర్డ్ లు హాక్ చేసిన మొబైల్ షాప్ వారా? ఆరా తీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నా ఫోన్ మరమ్మతుకు మొబైల్ షాప్ వారికి ఇచ్చినప్పుడు వాళ్ళు హాక్ చేశారా? ఇవన్నీ పోలీసులు, సైబర్ క్రైం వారు తేలుస్తారు. నా మీద అభిమానం చూపిన, చూపుతున్న నా ఆత్మీయ మిత్రులకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. దేశాయ్ బాబాయ్ మీ అభిమానం పది నిమిషాల ముందు నాకు ఫోన్ చేస్తే బాగుండేది. మీ అభిమానం నాకు కళ్ల నీళ్లు తెప్పించింది. పదివేల అభిమానం చెక్కు చెదరకుండా చేస్తాను. ఆరోగ్యం గా ఉన్న నన్ను బెడ్ మీద ఉంచిన ఆ దొంగ పని పట్టడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాను. మీ అభిమానానికి థాంక్స్.
Also Read: తల్లి దండ్రుల కన్నుగప్పుతున్న అమ్మాయిలు