- ఆర్థిక ఇబ్బందులతో సతమతం
- వేతనాలు చెల్లించకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరిక
మున్సిపల్ పట్టణాల్లో మహిళా గ్రూప్ ల నిర్వహణ లో కీలకంగా వ్యవహరిస్తున్న ఆర్ పి లకు గత 16 నెలలుగా తెలంగాణ ప్రభుత్వం వేతనాలు చెల్లించడం లేదు. సీపీఎం మంచిర్యాల కార్యదర్శి సంకెరవి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి గుళ్ళ బాలరాజులు మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలో పని చేస్తున్న ఆర్ పి ల కుటుంబాలు జీతాలు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఇచ్చే వేతనాలు సరిపోవడంలేదని అంతేకాకుండా సకాలంలో అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడాల్సివస్తోందని బాధితులు వాపోతున్నారు. జీతాలు సకాలంలో చెల్లించాలని పలు మార్లు విజ్ఞప్తి చేసి దరఖాస్తులు ఇచ్చినప్పటికీ స్థానిక అధికారులు, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే పెండింగ్ లో ఉన్న వేతనాలను విడుదల చేయాలని సీఐటీయూ మంచిర్యాల జిల్లా కమిటీ ప్రభుత్వాన్ని, అధికారులను డిమాండ్ చేస్తోంది. వేతనాలు విడుదల చేయని పక్షంలో ఆందోళన చేపడతామని అన్నారు.
Also Read: బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం పై నిషేధాజ్ఞలు కొనసాగింపు