- ఈ నెల 16న సత్కార కార్యక్రమం
- హాజరుకానున్న ప్రముఖులు
ప్రముఖ అవధాని, ఉపన్యాసకుడు గరికపాటి నరసింహారావుకి ఉషశ్రీ సంస్కృతి సత్కారం చేయాలని ఉషశ్రీ మిషన్ నిర్ణయించింది. రేడియో వాల్మీకిగా ప్రసిద్ధిగాంచిన ఉషశ్రీ రామాయణ మహాభారతాలను వర్తమాన సమాజంతో పోలుస్తూ, అందరికీ అర్ధమయ్యే రీతిలో వివరించారు. ధర్మసందేహాలు కార్యక్రమంతో యావత్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన ఉషశ్రీ పేరుమీద స్థాపించిన ఉషశ్రీ సంస్కృతి సత్కారాన్ని 2020 సంవత్సరానికిగాను ప్రముఖ అవధాని గరికపాటి నరసింహారావుకి ప్రదానం చేస్తున్నారు. ఉషశ్రీ మార్గంలో నడుస్తున్న గరికపాటి నరసింహారావు స్తోత్రాలను సామాజిక కోణంలో విశదీకరిస్తూ ప్రజలను చైతన్యపరుస్తున్నారు.
కరోనాతో వాయిదాపడ్డ సత్కార కార్యక్రమం:
కొవిడ్ కారణంగా కిందటేడాది మార్చి 16న నిర్వహించాల్సిన ఉషశ్రీ సంస్కృతి సత్కార కార్యక్రమాన్ని ఈ నెల 16 న నిర్వహిస్తున్నారు. మహా సహస్రావధాని గరికిపాటి నరసింహారావుగారు సత్కారాన్ని అందుకోనున్నారు. డాక్టర్ ఎన్. అనంత లక్ష్మి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి హాజరవుతారు. ప్రముఖ పాత్రికేయులు కె. రామచంద్రమూర్తి సత్కార కార్యక్రమానికి అధ్యక్షత వహించనున్నారు.
Also Read: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్
గతంలో సత్కారం అందుకున్న ప్రముఖులు:
ఇప్పటివరకు డా.దాశరధి రంగాచార్య, డా. పాలపర్తి శ్యామలనంద ప్రసాద్, డా. మాడుగుల నాగఫణిశర్మ, డా. బేతవోలు రామబ్రహ్మం. డా. రాళ్లబండి కవితా ప్రసాద్, డా. పుల్లెల శ్రీరామచంద్రుడు, గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్, చిరంజీవి తాతా సందీప శర్మ, డా. ఎన్ అనంతలక్షి లు ఉషశ్రీ సత్కారాన్ని అందుకున్నారు. 2020 సంవత్సరానికిగాను ప్రముఖ అవధాని గరికపాటి నరసింహారావుకి ఉషశ్రీ సంస్కృతి సత్కారాన్ని అందించనున్నట్లు ఉషశ్రీ మిషన్ తెలిపింది.