శతజయంతి ఉత్సవాల సందర్బంగా వందేళ్ల పీవీ జన్మ ధన్యమైంది. ఇది అక్షరాలా కేసిఆర్ చేస్తున్న మహత్తర కార్యం. కాంగ్రెస్ చేయలేని పనిని కేసీఆర్ తెలంగాణ బిడ్డగా పీవీ శత జయంతి ఉత్సవాలు నిర్వహించడం విమర్శకులు కూడా నిస్సందేహంగా ప్రశంసించారు. భారత దేశ రాజకీయాల్లో నెహ్రూ, పటేల్ పాత్ర ఎంతమేరకు స్నేహపూరితంగా ఉందో లేదా విబేధాల్లో నడిచిందో తెలియదు గానీ కొన్ని ఊహాగానాలు. కొన్ని పుస్తకాల్లో సర్ధార్ పటేల్ నిర్మొహమాటంగా చెప్పిన అభిప్రాయాల వల్ల బిజెపి తమ వాడిగా పటేల్ ను ఓన్ చేసుకొని గుజరాత్ లో ప్రపంచం నివ్వెర పోయేలా ఆయన నిలువెత్తు విగ్రహాన్ని నర్మదా నదీ తీరాన నిర్మించారు. మూడు వేల కోట్లతో ప్రపంచంలోనే ఎత్తయిన విగ్రహం ఏర్పాటు చేసిన ఘనత మోడీ ప్రభుత్వానికి దక్కింది. ఆయన భారత దేశ ప్రధాని కూడా కాదు. కానీ ఆయనకు ఇచ్చిన గౌరవాన్ని ఎవరు కాదనలేరు. ఒక మైనారిటీ ప్రభుత్వాన్ని చాకచక్యంగా నడిపి ఆర్థిక సంస్కరణల యోధుడిగా స్వాతంత్ర సమర యోధుడిగా , బహుభాషా కోవిదుడిగా ప్రపంచ ప్రశంసలు, ప్రతిపక్ష దిగ్గజం అటల్ బిహారీ వాజపేయి ప్రశంసలను అందుకున్నారు.
Also Read: కేసీఆర్ వ్యూహం లో పీవీ ఓటు బ్యాంక్…?
పీవీ చనిపోయే వరకు శత్రువు గా చూసిన కాంగ్రెస్ దిగ్గజాలు చనిపోయాక ఢిల్లీ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో కి తీసుకు వెళ్లకుండా అడ్డుపడి ఆఘమేఘాల మీద హైదరాబాద్ తరలించి హుస్సేన్ సాగర్ ఒడ్డున చితి పేర్చి కార్యక్రమాన్ని ముగించారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ఎన్నో కీలక కేంద్ర మంత్రిత్వ శాఖలు నిర్వహించిన పీవీ దేశ ప్రధానిగా సమర్థ వంత మైన పాత్ర నిర్వహిస్తే ఆయనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గౌరవం ఇది. సగం కాలిన ఆయన శవం చేయి పైకెత్తి హస్తం పార్టీని దోషిగా నిలబెట్టింది. ఇక చారిత్రక పుటల్లో పీవీ శకం ముగిసింది అనుకున్నారు. తెలంగాణ వచ్చినా కూడా పీవీ కి అనుకున్న గౌరవం దక్కలేదని బాధ పడ్డారు. ఒక్కసారిగా వందేళ్ల పీవీ ని మళ్ళీ వార్తల్లోకి తెచ్చిన ఘనత టిఆర్ఎస్ కు దక్కింది. కేసిఆర్ పివీ శత జయంతి ఉత్సవాలు ప్రకటించి కాంగ్రెస్ ను డిఫెన్స్ లో పడేశారు. ఒక్క సారిగా నిద్రావస్థలో ఉన్న పీవీ కుటుంబం లేచి మళ్ళీ రాజ లాంఛనాలు అందుకుంది. ఆయన పెరిగిన ఊరు వంగరకు కొత్త కళ వచ్చింది. జిల్లాల్లో పీవీ విగ్రహాలు వెలుస్తున్నాయి. అంతా బాగానే ఉంది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీవీ కుమార్తెను ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీకి దింపడం వల్ల టిఆర్ఎస్ పార్టీతో పాటు వ్యక్తిగతంగా కేసీఆర్ విమర్శలు ఎదుర్కొంటున్నారు. పీవీ కుటుంబాన్ని కాంగ్రెస్ నుండి వేరు చేయడం వల్ల టిఆర్ఎస్ కండువాను పీవీ కుటుంబ సభ్యులపై కప్పడం వల్ల ప్రతి కాంగ్రెస్ వాది మనస్థాపానికి లోనై పదవీ కాంక్ష కు పరాకాష్టగా టీఆర్ఎస్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. కేసీఆర్ గొప్ప ఉద్యమ కారుడు. గొప్ప లౌకిక రాజకీయ వేత్త. ఒక సామాజిక వర్గం నాయకుడు గెలుపు బాటలో ఉన్నాడని అదే సామాజిక వర్గాన్ని రంగంలోకి దింపడం వల్ల పీవీ పై కేసిఆర్ ప్రేమ ఓటు బ్యాంకు రాజకీయంగా మారడం సామాన్యుడు సైతం జీర్ణించుకోలేక పోతున్నాడు. అయినా పట్టభద్రులు మెజారిటీ వారు ఇతర కులస్థులు ఉండగా పీవీ కుటుంబ సభ్యులు పోటీకి దిగడం ఆశ్చర్యంగా ఉంది. కేసీఆర్ ఫోకస్ అంతా పాతిక వేలు ఉన్న బ్రాహ్మణ ఓట్లే కాదు విభిన్న వర్గాల ఓట్లు ఉన్నాయన్న సత్యాన్ని టీఆర్ఎస్ గ్రహించలేదా? ఇప్పుడు క్షేత్ర స్థాయిలో బహుజనుల ఓట్ల కోసం మరో సామాజిక వర్గాన్ని టిఆర్ఎస్ ఈ ఎన్నికల రంగంలోకి దించితే బాగుండేది. ఇక రాజీవ్ గాంధీ టికెట్ నిరాకరించి పివీ ప్రాధాన్యతను తగ్గించి వేయడం తో బ్రీఫ్ కేసు సర్దుకొని హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కే మూడ్ లో ఉన్న పీవీకి కుర్తాళం పీఠం నుండి పిలుపు వచ్చిందట. అది నియోగ బ్రాహ్మణ పీఠం. ఒక తెలుగు స్వామి నిర్మించిన పీఠం. ఆ పీఠాన్ని అధిష్టించి సన్యాసిగా హిత బోధ చేయాలనే తలంపు ఇచ్చారట. ఇంకేం బ్రీఫ్ కేసు లో కాషాయ వస్త్రాలు పెట్టుకొని తమిళ నాడు లో ఉన్న కుర్తాళం పీఠం వైపు పివీ దృష్టి సారించారని కొన్ని పత్రికలు రాసాయి. ఆ దశలో రాజీవ్ గాంధీ హత్య కాబడడం పివీ వైపు కాంగ్రెస్ కేడర్ కదలడం వెంటనే ప్రధాని పీఠం పై పివీ కూర్చుని ఖద్దరు బట్టలు ఇస్త్రీ వి కట్టాల్సిన పని ఏర్పడింది. అప్పుడు ఒక నియోగ బ్రాహ్మణ పీఠానికి నమస్కారం పెట్టి బహుజన వర్గాల బంధువు అయినప్పుడు పివీ బంధు జనం కూడా మద్దతుపలికింది.
Also Read: వంగర రూపు మారనుందా?
అలాంటి పివీ ని ఈ రోజు ఒక వర్గం ఓట్ల కోసం వారి రక్త సంబంధీకులను పోటీ కి దింపడ వల్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం ఈ విమర్శలను తిప్పి కొట్టి తాను తీసుకున్న నిర్ణయంలో తప్పు లేదని సమాజానికి చెప్పే బాధ్యత ఒక్క కేసీఆర్ కే ఉంది