- లంబూ ఫాస్ట్ బౌలర్ అరుదైన రికార్డు
క్రికెట్ కు వివిధ కారణాలతో గత ఏడాదికాలంగా దూరంగా ఉన్న భారత లంబూ ఫాస్ట్ బౌలర్ ఇశాంత్ శర్మ.వందటెస్టుల క్లబ్ లో చేరటానికి తహతహలాడుతున్నాడు.అహ్మదాబాద్ మోతేరా స్టేడియం వేదికగా ఇంగ్లండ్ తో జరిగే డే-నైట్ టెస్టు ద్వారా అరుదైన ఈ మైలురాయిని చేరనున్నాడు.కరోనా వైరస్ కారణంగా క్రికెట్ కార్యకలాపాలు స్తంభించిపోడం, అదీ చాలదన్నట్లుగా ఐపీఎల్ -13 ఆడుతూ గాయపడి.గత సంవత్సరకాలంగా ఆటకు దూరమైన ఇశాంత్ పూర్తి ఫిట్ నెస్ తో ప్రస్తుత 2021సీజన్ కు అందుబాటులోకి వచ్చాడు. సిరీస్ లోని మొదటి రెండుటెస్టుల్లో పాల్గొనడం ద్వారా తన ఫిట్ నెస్ ను నిరూపించుకోడమే కాదు.పలు కీలక వికెట్లు పడగొట్టడం ద్వారా 300 వికెట్ల రికార్డును అధిగమించాడు.
300 వికెట్ల మొనగాడు ఇశాంత్…
Also Read: చెన్నై షోతో ర్యాంకింగ్స్ల్ లో అశ్విన్, రోహిత్ జోరు
తన కెరియర్ లో ప్రస్తుత సిరీస్ లని మొదటి రెండుటెస్టుల వరకూ ఆడిన 99 టెస్టుల్లో 302 వికెట్లు పడగొట్టిన వందోటెస్టు కు పూర్తిస్థాయిలో సిద్ధమయ్యాడు.ఇప్పటికే 300 వికెట్లు పడగొట్టిన భారత ఫాస్ట్ బౌలర్ల సరసన ఇశాంత్ నిలిచాడు. 300 వికెట్ల భారత పేసర్లలో కపిల్ దేవ్,జహీర్ ఖాన్ మాత్రమే ఉన్నారు.
స్వదేశీ సిరీస్ ల్లో 100 వికెట్లు:
స్వదేశీ గడ్డపై వంద వికెట్లు పడగొట్టిన ఫాస్ట్ బౌలర్ గా కూడా ఇశాంత్ రికార్డుల్లో చేరాడు. స్వదేశీ సిరీస్ ల్లో ఇప్పటికే 100కు పైగా వికెట్లు పడగొట్టిన భారత పేసర్లలో కపిల్ దేవ్ ( 219 ), జవగళ్ శ్రీనాథ్ ( 108), జహీర్ ఖాన్ ( 104 ) ఉన్నారు.
టెస్టుల సెంచరీకి రెడీ:
ఇశాంత్ శర్మ ప్రస్తుత సిరీస్ లోని మూడోటెస్టు ఆడటం ద్వారా 100 టెస్టుల మైలురాయిని చేరిన భారత రెండో పేసర్ గా నిలువనున్నాడు. 32 ఏళ్ల ఈ జెయింట్ ఫాస్ట్ బౌలర్ కు ఇప్పటి వరకూ 99 టెస్టులు ఆడిన అనుభవం ఉంది.సీనియర్ ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్ గాయాలతో ఇంగ్లండ్ సిరీస్ కు దూరం కావడంతో.భారతజట్టుకు ఇశాంత్ శర్మ పెద్దదిక్కుకానున్నాడు.ఇంగ్లండ్ తో భారతజట్టు ఆడిన గత సిరీస్ లో ఇశాంత్ మొత్తం 18 వికెట్లు పడగొట్టి…తన జట్టు విజయంలో ప్రధానపాత్ర వహించాడు.
Also Read: అరంగేట్రం టెస్టులోనే అక్షర్ పాంచ్ పటాకా
2018 సీజన్ తర్వాత నుంచి తాను ఆడిన టెస్టుల్లో ప్రతి 41.7 బంతులకు ఒక వికెట్ చొప్పున పడగొడుతూ వస్తున్న ఇశాంత్…యార్కర్ల కింగ్ బుమ్రా కంటే మెరుగైన స్ట్రయిక్ రేట్ సాధించడం విశేషం.
భారత టెస్టు చరిత్రలో 100 టెస్టులు ఆడిన తొలి పేస్ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ మాత్రమే. కాగా వంద టెస్టులు ఆడిన తొలి ఫాస్ట్ బౌలర్ గా ఇశాంత్ రికార్డుల్లో నిలిచిపోనున్నాడు.అహ్మదాబాద్ మోతేరా స్టేడియం వేదికగా జరుగుతున్న డే-నైట్ టెస్టులో భారత్ విజేతగా నిలవాలంటే.గులాబీ రంగు బంతితో ఇశాంత్ అత్యుత్తమంగా రాణించక తప్పదు.