మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలోని ఆదివాసీలు తాము సాగు చేసుకుంటున్న భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని ఫారెస్టు శాఖ దాడులను ఆపాలని కోరుతూ సోమవారం ‘గ్రీవెన్స్ డే’ సందర్భంగా ఐటిడిఎపిఓకు దరఖాస్తులు ఇవ్వాలని ఉట్నూర్ కు బయలుదేరగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ నిర్లక్ష్యాన్ని మరోసారి ప్రదర్శిస్తూ ఎక్కడికక్కడ పోలీస్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఉట్నూర్ కు వెళ్లే వాళ్ళందర్నీ ఎక్కడికక్కడ ఆపివేసి కనీసం దరఖాస్తులు ఇచ్చుకునే అవకాశం కూడా లేకుండా చేశారు. మరోపక్క తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (TAGS) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోడసం భీం రావును, మంచిర్యాల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులైన బాగాల రాజన్న, ఎర్మ పున్నం,రాష్ట్ర నాయకులైన లంక రాఘవులు, పుసం సచిన్ ను అర్ధరాత్రి అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లు నిర్బంధించడం జరిగింది.
Also Read: యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్
జిల్లాలో ఉన్న ఆదివాసీ పేదలు ఈ ప్రభుత్వాలకు ఉగ్రవాదుల్లగా కనిపించారా అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సిపిఎం పార్టీ ప్రశ్నిస్తోంది. పేదల పైన ఇంత నిర్బంధం ప్రయోగించి భయానకమైన వాతావరణాన్ని సృష్టించిన ఈ ప్రభుత్వాలకు ఆదివాసీ పేదలు తగిన బుద్ధి చెబుతారని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఫారెస్టు శాఖ దౌర్జన్యాలు ఆపివేయాలని, సాగుదారులందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలని సిపిఎం డిమాండ్ చేస్తోంది.లేకుంటే పెద్ద ఎత్తున పోరాటాలు చెయ్యవలసి వస్తుందని ప్రభుత్వాలకు తెలియజేస్తున్నాం.
Also Read: బొగ్గు అక్రమ తవ్వకాలు, స్మగ్లింగ్
ఈ కార్యక్రమంలో సంకే రవి సిపిఎం మంచిర్యాల జిల్లా కార్యదర్శి, పోతు శంకర్ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు,దుంపల రంజిత్ జిల్లా కమిటీ సభ్యులు, బండారి రవి కుమార్ TAGS రాష్ట్ర సహాయ కార్యదర్శి మరియు CPM నాయకులు బొంకురి గోవర్ధన్, కే.అశోక్ ,అంజన్న, రాజన్న తదితరులు పాల్గొన్నారు.