- కాసులకు కక్కుర్తిపడుతున్న అధికారులు
- వేలకోట్లలో సంస్థలకు నష్టం
- సీబీఐ దాడుల్లో విస్తుపోయే వాస్తవాలు
కోలిండియా అనుబంధ ఈసీఎల్ లోని లీజ్ ఏరియా ల్లో అక్రమంగా బొగ్గు తవ్వకాలతో పాటు బొగ్గు స్మగ్లింగ్ యథేచ్చగా సాగుతోంది. 2020 నవంబర్ లో 5 రాష్ట్రాలలో 45 ప్రదేశాల్లో దాడులు చేసిన సీబీఐ శుక్రవారం (ఫిబ్రవరి 19) తాజాగా కొల్ కతా లోని13 చోట్ల దాడులు నిర్వహించారు. బంకురా, పశ్చిమ బర్దమన్, పురులియా లలో దాడులు నిర్వహించారు. ఇవి ఈసీఎల్ లోని కాజోరా, కునుస్టోరియా ఏరియా పరిథిలోకి వస్తాయి. వేల కోట్ల రూపాయల స్కాం లో అమియా స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. బొగ్గు వ్యాపారి అనూప్ మాంజి తో పాటు ఈసీఎల్ జీఎం లు అమిత్ కుమార్ దరు, జయేష్ చంద్రరాయ్, చీఫ్ ఆఫ్ సెక్యురిటి తనమైదాస్, ఇన్స్పెక్టర్ దనుంజయ్ రాయ్ ఇంఛార్జి దేబాశిష్ ముఖర్జీ ల పై కేసులు నమోదుచేశారు.
Also Read: యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్
స్మగ్లర్లకు నేతల అండ:
అధికారులు నిర్వహించిన దాడుల్లో 40 లక్షల రూపాయల నగదుతో పాటు కీలక పత్రాలను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఎన్నికలు జరుగనున్న పశ్చిమ బెంగాల్ లోని కోల్ కోతలో వేలకోట్ల రూపాయల బొగ్గు కుంభకోణంలో సీబీఐ దాడులు జరగడం సంచలనంగా మారింది. బొగ్గు కుంభకోణం లో ఉండే స్మగ్లర్లకు రాజకీయ నాయకుల అండదండలు ఉంటాయి. ఇటీవల మాజీ బీజేపీ మంత్రికి గతంలో జరిగిన బొగ్గు కుంభకోణం లో శిక్షలు కూడా పడిన దాఖలాలు ఉన్నాయి. మేఘాలయా లో జయింటియా గనులు అక్రమంగానే నడుస్తున్నాయి. మరోవైపు కేంద్రం 500 బొగ్గు బ్లాక్ లను వేలం వేయడానికి నిర్ణయం తీసుకుంది. 50 గనులను ఇప్పటికే వేలం వేయగా మిగతా గనుల వేలం ప్రక్రియ కొనసాగుతోంది.
అధికారుల అలసత్వం:
ఇక బొగ్గు గనుల అక్రమ వ్యాపారం తవ్వకాలకు అడ్డుకట్ట వేసేందుకు అవకాశం ఉండదు. గనిని వేలంలో తీసుకున్న లైసెన్స్ పేరిట ఇంకా అక్రమాలు చోటు చేసుకున్నా వాటి వైపు అధికారులు కన్నెత్తి చూడరు. అక్రమ మైనింగ్ అదుపు సీబీఐ లేదా సీఐఎసెఫ్ ల వల్లో వారి దాడుల వల్లో నిలువరించడం అసాధ్యం. అధికారంలో ఉన్న పార్టీ నేతల్లో చిత్త శుద్ధి మార్పు రావాలి. ఆ మేరకు అక్రమార్కుల అవినీతి పరుల ను అదుపులో పెట్టవచ్చు. ఈసీఎల్ లో జీఎం స్థాయి అధికారులు, సెక్యురిటి అధికారులు కొద్ది పాటి డబ్బులకు కక్కుర్తి పడటంతో సంస్థకు వేల కోట్ల రూపాయలు సంస్థకు నష్టం వాటిల్లుతోంది.
Also Read: రహదారి భద్రత పై అవగాహన సదస్సు