- నడాల్, సెరెనా రికార్డు ఆశలు ఆవిరి
- క్వార్టర్స్ లో నడాల్, సెమీస్ లో సెరెనా అవుట్
కొత్త దశాబ్ది తొలిగ్రాండ్ స్లామ్ టోర్నీ ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ ద్వారా చరిత్ర సృష్టించాలని కలలుకన్న టెన్నిస్ దిగ్గజాలు రాఫెల్ నడాల్, సెరెనా విలియమ్స్ ల ఆశలు సెమీస్ రౌండ్ కు ముందే అడియాసలుగా మారిపోయాయి. మెల్బోర్న్ లోని రాడ్ లేవర్ ఎరీనా వేదికగా జరుగుతున్న 2021 ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ లో స్విస్ గ్రేట్ రోజర్ ఫెదరర్ అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్స్ రికార్డును అధిగమించాలని స్పానిష్ బుల్ రాఫెల్ నడాల్, 24వ గ్రాండ్ స్లామ్ టైటి్ల నెగ్గడం ద్వారా మార్గారెట్ కోర్టు సరసన నిలవాలని సెరెనా కలలు కన్నారు. అయితే ఈ ఇద్దరూ తమతమ విభాగాలలో ఫైనల్స్ చేరకుండానే ఉసూరు మంటూ నిష్క్ర్రమించక తప్పలేదు.
ఇదీ చదవండి:ఐపీఎల్ వేలం చరిత్రలో ముగ్గురూ ముగ్గురే
సెరెనాకు ఒసాకా షాక్ :
మహిళల సింగిల్స్ గ్రాండ్ స్లామ్ టోర్నీల చరిత్రలో ఇప్పటికే 23 టైటిల్స్ నెగ్గి 24వ టైటిల్ కోసం గత మూడేళ్లుగా ఎదురుచూస్తున్న అమెరికన్ బ్లాక్ థండర్ సెరెనా కు 2021 సీజన్ తొలిటోర్నీ సైతం ఏమాత్రం కలసి రాలేదు. ఫైనల్లో చోటు కోసం జపాన్ ప్లేయర్ నవోమీ ఒసాకాతో జరిగిన సెమీఫైనల్లో సెరెనా 3-6, 4-6తో ఓటమి పొంది కన్నీరుమున్నీరయ్యింది.అనవసరపు తప్పిదాలతో గెలవాల్సిన మ్యాచ్ లో ఓడానంటూ 39 సంవత్సరాల సెరెనా మీడియా సమావేశంలో వెటరన్ సెరెనా వెక్కివెక్కి ఏడ్చినంత పనిచేసింది. ఇప్పటికే తనకెరియర్ లో ఏడుసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ నెగ్గిన సెరెనాప్రస్తుత సీజన్ మిగిలిన మూడు గ్రాండ్ స్లామ్ టోర్నీలలో ఏ ఒక్కటి నెగ్గినా మార్గారెట్ రికార్డును సమం చేయగలుగుతుంది.టైటిట్ దక్కించుకున్న సెరెనా పైనల్ రేసునుంచి తప్పుకోవడంతో ఒక్కసారిగా ఉద్వేగానికి గురయ్యారు.
ఆసీస్ మారథాన్ పోరులో నడాల్ ఓటమి:
ప్రస్తుత సీజన్ ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ టైటిల్ నెగ్గడం ద్వారా రోజర్ ఫెదరర్ పేరుతో ఉన్న అత్యధిక గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్స్ రికార్డును అధిగమించాలన్న నడాల్ లక్ష్యం క్వార్టర్ ఫైనల్స్ పరాజయంతో నీరుగారిపోయింది. తన కెరియర్ లో ఇప్పటికే 20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గడం ద్వారా ఫెదరర్ రికార్డును సమం చేసిన 34 ఏళ్ల నడాల్ గ్రీకువీరుడు స్టెఫానోస్ సిటిస్ పాస్ తో జరిగిన 4గంటల 5 నిముషాల హోరాహోరీ సమరంలో తుదివరకూ పోరాడి ఓటమి చవిచూశాడు. మొదటి రెండుసెట్లూ 6-3, 6-2తో నెగ్గి 2-0 ఆధిక్యంతో నిలిచిన నడాల్ ఆ తర్వాతి మూడుసెట్లను 6-7, 4-6, 5-7తో కోల్పోయి 2-3 ఓటమితో టోర్నీ నుంచి నిష్క్ర్రమించాడు. మొత్తం మీద పురుషుల, మహిళల సింగిల్స్ లో నడాల్,సెరెనా పరాజయాలు అతిపెద్ద సంచలనాలుగా నమోదయ్యాయి.
ఇదీ చదవండి : ఐపీఎల్-2021 వేలంలో రికార్డు ధర