- రాజీనామా చేస్తున్న ఎమ్మెల్యేలు
- సమానంగా అధికార ప్రతిపక్షాల బలం
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పుదుచ్చేరిలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నెల రోజుల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేయడంతో పార్టీ బలం మెజారిటీ మార్కు దిగువకు చేరింది. దీంతో పుదుచ్చేరిలో రాజకీయాలు ఆసక్తిగా మారాయి. త్వరలో జరగబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రేపు (ఫిబ్రవరి 17) పుదుచ్చేరి రానున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేల రాజీనామాలు పార్టీ నాయకత్వాన్ని కలవరపెడుతున్నాయి.
Also Read: ముఖ్యమంత్రికీ, గవర్నర్ కీ మధ్య చిచ్చు
సమానంగా అధికార, ప్రతిపక్షాల బలం :
జనవరి 25న ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా ఒక ఎమ్మెల్యే ఫిబ్రవరి 15న మరో ఎమ్మెల్యే ఈ రోజు (ఫిబ్రవరి 16) రాజీనామా చేశారు. 33 స్థానాలున్న పుదుచ్చేరి అసెంబ్లీ లో మూడు నామినేటెడ్ స్థానాలున్నాయి. 2016 లో 30 స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా కాంగ్రెస్ 14 స్థానాల్లో విజయం సాధించింది. ఆ పార్టీకి డీఎంకే నుంచి ఇద్దరితో పాటు మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు మద్దతునిస్తున్నారు. తాజాగా నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో అధికార ప్రతిపక్ష పార్టీల బలం 14 కి చేరాయి.
Also Read: 5 రాష్ట్రాలలో అన్ని పార్టీలకూ అగ్నిపరీక్ష