• నామినేషన్ల దాఖలుకు ఆఖరు తేది ఫిబ్రవరి 23
• మార్చి 14న పోలింగ్
తెలంగాణ శాసన మండలిలోని రెండు పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికల ప్రక్రియ ఇవాల్టి నుంచి ప్రారంభమైంది. మహబూబ్ నగర్ – రంగారెడ్డి-హైదరాబాద్ వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న సభ్యుల పదవీకాలం ఈ ఏడాది మార్చి 29వ తేదీతో ముగియనుంది. ఖాళీ అయ్యే స్థానాల భర్తీకి ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను ప్రకటించింది.
Also Read: దుర్భాషల `ఘనులు`
ఈ రోజు (ఫిబ్రవరి 16) మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ నియోజకవర్గానికి ఎన్నికల అధికారిగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అదనపు కమిషనర్, వరంగల్-ఖమ్మం-నల్గొండ నియోజకవర్గానికి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ మండలి ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. ఇవాల్టి ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఈ నెల 23 వరకు నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది. మరుసటి రోజు నామినేషన్లను పరిశీలించి అర్హుల జాబితాను ప్రకటిస్తారు. 26 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. మార్చి14న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల కు కు పోలింగ్ నిర్వహిస్తారు. 17న ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు.
Also Read: సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ నేత పొన్నాల ధ్వజం