- లోటస్ పాండ్ కు భారీగా చేరుకున్న నేతలు
- బాణసంచా కాల్చి సంబురాలు చేస్తున్న అభిమానులు
షర్మిల తెలుగు రాష్ట్రాలలో పరిచయం అక్కరలేని పేరు. అలా అని మరిచిపోయే పేరూ కాదు. గతంలో పాదయాత్ర పేరుతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్ర చేసిన షర్మిళ కొన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే ఇటీవల సామాజిక మాధ్యమాలతో పాటు తెలుగు పత్రికలలో రాజన్న కూతురు పార్టీ పెడుతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో లోటస్ పాండ్ లోని షర్మిల భర్త అనిల్ కార్యాలయం అభిమానులతో కోలాహలంగా మారింది. కర్నూలు, ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాలనుంచి భారీ సంఖ్యలో రాజశేఖర్ రెడ్డి అభిమానులు తరలివచ్చారు. బాణసంచా కాల్చిన అభిమానులు డప్పువాయిద్యాలతో మోగిస్తూ సందడి చేస్తున్నారు. కొద్ది సేపటి క్రితం రాజశేఖర్ రెడ్డి అభిమానులు, కొంతమంది ప్రముఖ నేతలతో షర్మిల సమావేశం ముగిసింది. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తాను పోషించబోయే పాత్ర గురించి మరి కాసేపట్లో షర్మిల తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారు.
షర్మిల ఆత్మీయ సమావేశం సందర్భంగా మన కష్టం తెలుసు మన కన్నీళ్లు తెలుసు మన బ్రతుకులు మార్చేబాట వైఎస్సార్ కుటుంబానికి తెలుసు షర్మిల నాయకత్వం వర్థిల్లాలి, జనంలోకి వస్తుంది షర్మిలక్క ..జనరంజకపాలన ముందుందిక అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి.
షర్మిల పార్టీ పెడుతున్నారన్న వార్తలతో తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పెను మార్పులు తప్పకపోవచ్చనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. దివంగత రాజశేఖర రెడ్డి పెళ్లిరోజైన ఫిబ్రవరి 9నే ఆమె రాజకీయాల్లో ఆమె పాత్ర గురించి ప్రకటన చేయనుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇదీ చదవండి: