- చెపాక్ లో నెట్ ప్రాక్టీస్ షురూ
- ఫిబ్రవరి 5 నుంచి తొలిటెస్ట్ మ్యాచ్
కొత్త సంవత్సరంలో భారతగడ్డపై సరికొత్త టెస్ట్ సిరీస్ కు కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ లో భాగంగా టెస్ట్ క్రికెట్ టాప్ ర్యాంకర్ భారత్, 4వ ర్యాంకర్ ఇంగ్లండ్ జట్ల మధ్య నాలుగుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు చెన్నై చెపాక్ స్టేడియంలో రంగం సిద్ధమయ్యింది.
గత వారం రోజులుగా క్వారెంటైన్ లో గడిపిన రెండుజట్ల ఆటగాళ్లు, సహాయక సిబ్బంది…మూడు కోవిడ్ పరీక్షల్లో నెగిటివ్ గా రావడంతో…నెట్ ప్రాక్టీసుకు మార్గం సుగమమయ్యింది.
Also Read : చెన్నై టెస్టులో రోహిత్ జోడీ ఎవరో?
వారం రోజుల క్రితమే దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి చెన్నై చేరుకొన్న భారత క్రికెటర్లంతా బయోబబుల్ వాతావరణంలోనే ఉంటూ టెస్ట్ మ్యాచ్ కు సమాయత్తమయ్యారు.
నెట్ ప్రాక్టీస్ ప్రారంభానికి ముందు చీఫ్ కోచ్ ఆటగాళ్లకు స్వాగతం పలుకుతూ సందేశమిచ్చారు. కెప్టెన్ విరాట్ కొహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్యా రహానే, డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ, సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఇశాంత్ శర్మ,స్పిన్ జాదూ రవిచంద్రన్ అశ్విన్, జట్టులోని ఇతర ఆటగాళ్లు వామప్ కార్యక్రమంలో పాల్గొని కసరత్తులు చేశారు.
ఇంగ్లండ్ క్రికెటర్ల జోరు
ఇంగ్లండ్ ఆటగాళ్లు సైతం కోవిడ్ పరీక్షల అనంతరం నెట్ ప్రాక్టీసు ప్రారంభించారు. ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్, ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్, జోస్ బట్లర్ నెట్ ప్రాక్టీసుతో బిజీబిజీగాగడిపారు.
Also Read : రెండో టెస్టు నుంచే ప్రేక్షకులకు అనుమతి
నాలుగు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలిటెస్టు ఫిబ్రవరి 5 నుంచి, రెండో టెస్టు పిబ్రవరి 13 నుంచి చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరుగనున్నాయి.
భారతజట్టు ఇటీవలే ఆస్ట్ర్రేలియాతో ముగిసిన నాలుగుమ్యాచ్ ల సిరీస్ ను 2-1తో నెగ్గితే…శ్రీలంక గడ్డపై శ్రీలంకను ఇంగ్లండ్ 2-0తో చిత్తు చేయడం ద్వారా కీలక సిరీస్ సమరానికి సిద్ధమయ్యాయి.
Also Read : జాతీయ టీ-20 విజేత తమిళనాడు